ఎమ్మెల్యే కూతూహలమ్మకు తీవ్ర అస్వస్థత


చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు శాసనసభ్యురాలు జి.కుతూహలమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఐదోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. కిందటి శాసనసభలో డిప్యూటి స్పీకర్ గా ఉండేవారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవలి కాలంలో ఆమె అసమ్మతి వర్గంలో ఉన్నారు. మంత్రి కావాలని గట్టి గా ఆశిస్తున్నారు. ఆమెకు యూరిన్ ఇన్ఫెక్షన్ సోకింది.మూడు రోజులుగా తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో ఉన్న ఆమెను చెన్పైకి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం కోసం తరలిస్తున్నామని ,ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!