రెండుసార్లూ చెన్నై కింగ్స్‌కే..



డిపెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌రుస‌గా రెండ‌వ సారీ ఐపిఎల్ టైటిల్ గెలుచుకుంది.. ధోని సార‌ధ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌య‌దుంధుభి మ్రోగించింది. ఏ ఫార్మాట‌యినా కెప్టెన్‌గా త‌న‌కు తిరుగులేద‌ని ధోని నిరూపించుకున్నారు.
ఇక చెపాక్‌లో ఎదురేలేని సూపర్ కింగ్స్‌ది ఫైనల్లోనూ అదే జోరు! ధోనీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో చెన్నయ్ సూపర్‌కింగ్స్ ఐపీఎల్ కిరీటం మరోమారు ఒడిసిపట్టింది! చెన్నయ్: డిఫెండింగ్ చాంప్ చెన్నయ్
అచ్చొచ్చిన చెపాక్ మైదానంలో వరుసగా తొమ్మిదో విజయం నమోదు చేస్తూ… రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన అంతిమ సమరంలో 58 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. విజ‌య్ సూప‌ర్ ఇన్నింగ్స్‌తో చెన్నై ఐదు వికెట్లకు 205 పరుగుల స్కోరు సాధించి భారీ ల‌క్ష్యాన్ని బెంగుళూరు ముందు ఉంచింది. కానీ బెంగుళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ఏ ద‌శ‌లోనూ ల‌క్ష్యాన్ని ఛేధించే దిశ‌గా ప‌య‌నించ‌లేక‌పోయారు. ఎనిమిది వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 147 ప‌రుగుల‌కే చ‌తికిల ప‌డిపోయింది. వ‌రుస‌గా రెండ‌వ‌సారి ఐపిఎల్ టైటిల్ గెలుచుకున్న చెన్నై ముందు ముందు కూడా తన తిరుగులేని అధిప‌త్యాన్ని నిలుపుకుంటుందో లేదో..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!