ప్ర‌ధానిపై బాబు గ‌రం.. గ‌రం..

రాష్ట్ర రాజ‌కీయాల్లో ఉన్న ఎన్నిక‌ల వేడి త‌గ్గింత‌ర్వాత చంద్ర‌బాబు రైతుల స‌మ‌స్య‌ల‌పై పోరు బాట‌ప‌ట్టారు. దీనికోసం ఆయ‌న ఆమ‌ధ్య ఇందిరాపార్క్ ద‌గ్గ‌ర ధ‌ర్నా కూడా చేసారు.  ఆయ‌న రైతు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌ధానితో ఏక‌రువు పెట్టాల‌ని ఢిల్లీ వెళ్ళారు. కానీ బాబు ప్ర‌ధాని అపాయింట్‌మెంట్ కోసం నాలుగు సార్లు ప్ర‌య‌త్నించినా దొర‌క‌లేదు. దాంతో బాబుకి ప్ర‌ధానిమీద పీక‌ల‌వ‌ర‌కూ కోప‌మొచ్చేసింది. రైతు ప్ర‌భుత్వం, పేద‌ల ప్ర‌భుత్వం అని ఢాంభీకాలు ప‌లికే కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతు స‌మ‌స్య‌ల‌పై కంప్లైంట్ ఇవ్వ‌డానికి తాను వ‌స్తే.. క‌నీసం అప్పాయింట్ మెంట్ దొర‌క‌డంలేదంటే.. ఈ ప్ర‌భుత్వానికి రైతుల ప‌ట్ల ఎంత అభిమానం, ప్రేమ ఉన్నాయో తెలుస్తుంద‌ని ప్ర‌ధానిపై బాబు ఏ రేంజ్‌లో ఫైర‌యిపోయారు. చేసేది లేక కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి శ‌ర‌ద్‌ప‌వార్‌ను క‌లిసి రైతు స‌మ‌స్య‌లు చెప్పారు. వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్యం అని చెబుతున్న కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర ఇప్పించ‌లేక‌పోయాయ‌ని బాబు ధ్వ‌జ‌మెత్తారు. రైతు స‌మ‌స్య‌ల‌కి స్పందించ‌ని ప్ర‌ధాని ప్ర‌తిష్ట‌ని, కాంగ్రెస్ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌ని జ‌నాల్లోకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్ట‌డానికి బాబు ఎత్తు వేసే ప‌నిలో ప‌డిపోయారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!