రేఖ రియ‌ల్‌స్టోరీతో సినిమా..

భానురేఖా గ‌ణేష‌న్ అలియాస్ రేఖ‌.. ఈ త‌మిళ ముద్దు గుమ్మ మూడు ద‌శాబ్దాలుగా బాలీవుడ్ స‌మ్రాజ్యాన్ని ఏలు తుందంటే మామూలు విశ‌యం కాదు.. అప్ప‌టికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లుగా పేరు సంపాదించిన వారితో పోటీ ప‌డి మ‌రీ త‌న పేరుని నెంబ‌ర్‌స్థానంలో నిల‌బెట్టుకున్న ఘ‌న‌త రేఖ‌ది. వ‌య‌సు మీద ప‌డుతున్నా ఏమాత్రం వ‌న్నె త‌గ్గ‌ని అందంతో ఇప్ప‌టికీ ఆమె మ‌గాళ్ళ మ‌న‌సులు దోచుకుంటుం దంటే అతిశ‌యోక్తి కాదు.. వెండితెర‌పై ఆమెకి ల‌భించిన విజ‌యాలు, ఆమె సృష్టించిన వివాదాలతో ఆమె రంగుల జీవితం, ఆమె వ్య‌క్తి గ‌త జీవితం లోని ఎత్తుప‌ల్లాల‌ని, ఆమె న‌టిగా చ‌విచూసిన జ‌యాప‌జ‌యాల‌ని, క్రోడీక‌రించి ఓ సినిమా నిర్మించ‌డానికి స‌న్న‌హాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో రేఖ‌గా న‌టించ‌డానికి శ్రీ‌దేవిని అనుకుం టున్నారు.. ఒక వేళ ఆమె ఒప్పుకోక‌పోతే ఆ పాత్ర‌లో రాణీముఖ‌ర్జీతో ఆ పాత్ర‌ని చేయించాల‌ని అనుకుంటున్నారు. ఏది ఏమ‌యిన‌ప్ప‌టికీ నేటీ యువ‌తుల‌కు ఆమె జీవితం స్ఫూర్తిగా నిలుస్తుంద‌ని చెప్ప‌టంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!