ఎప్పుడు చస్తావని అడగలేదు..


ఎవరినైనా రిటైర్ మెంట్ గురించి అడగవచ్చేమోకాని , రాజకీయ నాయకులను అడిగితే వారికి చచ్చేంత కోపం వస్తుంది.సరిగ్గా ఇదే విధంగా మాట్లాడారు శివసేన అధినేత బాల్‌ ధాకరే. ఆయన ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా వచ్చిన ఒక ప్రశ్న ఏమిటంటే మీరు రాజకీయాలనుంచి రిటైర్ అవుతారు అని . దానికి ఆయన ఒకరకంగా మండి పడ్డారు. నా చావు కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అని ఎదురు ప్రశ్నించారు.83 ఏళ్ల వయసు కలిగిన బాల్‌ ధాకరేని మీ వారసత్వం ఎవరికి వెళుతుంది అని అడిగితే అసలు అలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తారో అర్ధం కాదని వ్యాఖ్యానించారు.అసలు ఆ రకంగా ఎందుకు ఆలోచిస్తారు. ధాంక్ గాడ్. మీరు నేరుగా అడగలేదు. మీరు చస్తే ఏమవుతుందని అడగలేదు. నేను చస్తే నేను ఏమి చేయగలను,ఏమీ చేయలేను. ఇలాంటి చెత్త ప్రశ్నలు వేస్తుంటే నా చావు కోసం ఎదురు చూస్తున్నట్లుంది అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఉద్దేశించి అన్నారు.పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఉద్దావ్ ఠాక్రే మీ స్థానాన్ని ఆక్రమిస్తారా అని అడిగితే, ఆయన నా స్థానం తీసుకుంటారా? ఇంకో స్థానం తీసుకుంటారా అన్న ప్రసక్తే లేదు. మీకు తెలుసా ? మీరెప్పుడు రిటైర్ అవుతారో? అని ఎదురు ప్రశ్నించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!