రాజధాని నుండి ఆజాద్ పిలుపు, చిరు పయనం..
చిరంజీవికి ఢిల్లీ నుండి పిలుపొచ్చింది.. ఆయనకి ఢిల్లీ నుండి పిలుపు రాగానే చిరంజీవికి ఏదో పేద్ద పోస్టు దక్కేలాగే ఉందని ప్రజారాజ్యం పార్టీ నాయకులు అనుకోవడం, చిరంజీవి ఢిల్లీలో ఓ నాలుగు పెద్ద తలకాయలని కలిసి చేతులూపుకుంటూ తిరిగి రావడం మామూలయిపోయింది. ఈ నేపథ్యంలో చిరంజీవికి మళ్ళీ ఢిల్లీ నుండి పిలుపొచ్చింది. ఈసారి చిరంజీవిని గులాం నబీ ఆజాద్ నుండి పిలుపొచ్చింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించిన ఆజాద్ కాంగ్రెస్ నాయకులు ఒకరి మీద ఒకరు ఇచ్చిన ఫిర్యాదులు విని తల బొప్పి కట్టించుకుని మరీ వెళ్ళిపోయారు. మరి.. ఇప్పుడు చిరంజీవిని ఢిల్లీకి పిలిపించి చిరంజీవి తల బొప్పి కట్టేలా ఏవో కొన్ని మాటలు చెప్పి తిరిగి పంపిస్తారో, లేక చిరంజీవితో పాటు పీఆర్పీ నాయకులు కోరుకుంటున్నట్టు చిరంజీవికి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారో.. చూడాలి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ అంతుకు ముందు రైల్వేశాఖ మంత్రి. ఇప్పుడు ఆమె రాజీనామా చేయడంతో ఆ పోస్టు ప్రధానమంత్రి ఆధీనంలో ఉంది.. ఒక వేళ ఎ.పి. వారి అదృష్టం బావుండి.. ఆ శాఖ మన చిరంజీవికి గానీ, లేదంటే మన కాంగ్రెస్ ఎం.పి.లో ఎవరికైనా గాని దక్కితే బావుం టుందని అందరూ భావిస్తున్నారు.. మరి.. ఏం జరుగుతుందో.. వేచి చూడాలి..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి