మహానగరంలో మృగాళ్లు (ఓ అమ్మాయి ఆత్మఘోష..)


ప్రతి అమ్మాయిలాగానే నేను కూడా అన్నింటిలో ముందడుగు వేయాలని , బాగా చదువుకోవాలని అనేక కలలతో ఈ నగరానికి వచ్చాను. వచ్చాక గానీ తెలియలేదు.. నేను వచ్చింది మనుషుల మధ్య‌కు కాదు.. మనిషి రూపంలో ఉన్న పశువుల మధ్యకు వచ్చానని..
ఇక్కడ బంధాలకూ, అనుబంధాలకూ అర్థం తెలియదు. ప్రతివాడి చూపు కామంతో నిండి ఉండేదే… అందులో వయసు బేధం ఏమీలేదు. వాడు మగాడు ఐతే చాలు. కంపరం పుట్టించే వెకిలి మాటలతో…అసభ్య చేష్టలతో పెద్ద మనుషుల్లా ముసుగేసుకుని బ్రతుకుతున్న ఈ కుక్కల మధ్య ఆడపిల్ల అనుక్షణం అవమానాలతో, అనుమానించబడుతూనే ఉంది. కొంచం ఆలసత్వం ప్రదర్శించామంటే జీవితం ఎందుకు పనికిరాకుండాపోతుంది. గొప్ప చదువులు చదివి అన్ని రంగాల్లో ముందున్నామని ఆనందపడుతున్న ప్రతి ఆడది ఒకసారి ఆలోచించాలి. నిజంగా మనకుమనం కాపాడబడుతున్నామా? అని కాకుండా, కాపాడుకోవడం ఎలా అని ఆలోచించాలే తప్ప ఎవరో ఏదో చేయాలని ఎందుకు చూస్తున్నారు.
ప్రేమల పేరుతో, యాసిడ్ దాడులు చేసేవాడు ఒకడు. భార్యను అనుమానంతో హతమార్చే ప్రబుధ్దుడు ఇంకొకడు. మరోవైపు స్కూల్ లో పాఠాలు చెప్పే గురువే కామాంధుడైపోతున్నాడు.
ఆఫీస్ లో అమ్మాయిలను ఆట వస్తువుగా భావించేవారు..
ఎందుకు… ఎందుకు?? ఇలా జరుగుతుందో ఆలోచిస్తే…మన తప్పులు మనకు కూడా అవగతమవుతాయి. డబ్బు కోసం అంగాంగ ప్రదర్శనలు, లక్సరీ లైఫ్ లీడ్ చేయాలనే మత్తులో విశృంకులత్వం, అందంతో ఏదైనా సాధించగలం అనే అపోహలు…ఇలాంటివి అమ్మాయిల్లో కూడా తొలిగిపోవాలి. అన్నిరంగాల్లో ముదున్న సభ్యత, సంస్కారం మరిచిపోకుండా అమ్మాయి గడప దాటిన నాడు ఈ కామాంధులుని పురుగుల్లా ఏరిపారేసే శక్తి ఒక్క ఆడదానికే ఉంది. కీచకులని వెంటాడి సమాధానం చెప్పగలదని ప్రతి మగ మృగానికి తెలియచేయాలని తెలుసుకున్నాను. నా కర్తవ్యం నాకు బోధపడింది. మహామృగాలున్న మహానగరంలో ఎలా ఉండాలో నాకు అర్థమవుతోంది.

- మధులత (హైదరాబాద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!