నేను దుష్టశక్తిని కాను, బాబే అమావాస్య చంద్రుడు
తనను ఉద్దేశిస్తూ ఓ దుష్టశక్తి వల్లనే స్వర్గీయ ఎన్టీ రామా రావుపై తిరుగుబాటు చేశానన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, ఎన్టీ రామరావు సతీమణి లక్ష్మీపార్వతి దుమ్మెత్తిపోశారు. తన చేతకాని తనాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు తనపై వ్యాఖ్యలు చేశారని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాశనమైపోయిందని ఆమె విమర్శించారు. చంద్రబాబునాయుడిని ఆమె అమావాస్య చంద్రుడిగా అభివర్ణించారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కృష్ణపక్షంలో చంద్రుడు క్షీణిస్తున్నట్లుగా క్షీణిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.
మాజీ ప్రధాని వాజ్‌పేయి వల్లనే చంద్రబాబు 1999 ఎన్నికల్లో గెలిచారని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారని ఆమె చెప్పారు. స్వర్గీయ ఎన్టీ రామారావు మృతికి చంద్రబాబే కారణమని ఆమె అన్నారు. చంద్రబాబుపై నమ్మకం లేక పార్టీ ఖాళీ అవుతోందని ఆమె అన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. చంద్రబాబు వెన్నుపోటు వల్లనే ఎన్టీ రామరావు మనస్తాపానికి గురై మరణించారని ఆమె అన్నారు. తాను 1999లో ఎన్టీఆర్‌తో కలిసి ప్రచారం నిర్వహించలేకపోతే అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదని, తనని ఎన్టీఆర్ పెళ్ళి చేసుకున్నారు కాబట్టే, తాను ఆయనతో కలిసి రాష్ట్రం మొత్తం తిరిగాము కాబట్టే టిడిపి అధికారంలోకి వచ్చిందని ఆమె అన్నారు. ఎన్టీఆర్ కుటుంబీకులు గానీ, చంద్రబాబు గానీ ఎవరూ అప్పుడు ప్రచారానికి కూడా రాలేదని దయ్యబట్టారు. ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఒక్కరు కూడా పరామర్శించని వాళ్ళు, ఆయన కష్టపడి అధికారం దక్కించుకుంటే ఆ అధికారాన్ని లాక్కుని ఆయనని మానసికంగా కృంగదీశారని అన్నారు. మొత్తానికి చంద్రబాబు దుష్టశక్తి అని లక్ష్మీపార్వతిని అంటే లక్ష్మీపార్వతి ఆయన్ని అమావస్య చంద్రుడు అంటూ ఒకరిమీద ఒకరు ఆడిపోసుకుంటున్నారు.. మరి ఈ పరస్పర ఆరోపణలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయో చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి