తుపాకీ పట్టిన టి.డి.పి. ఎమ్మెల్యే
కరీంనగర్‌లో తెలుగుదేశం తెలంగాణ ఫోరం ఏర్పాటు చేసిన రణభేరి సభకి టి.ఆర్.ఎస్. కార్యకర్తల నుండి తీవ్రనిరసన వెలువడుతుందన్నది టి.డి.పి. నాయకులకి ముందుగానే తెలుసుకున్నారు. అందుకే ఎవరి జాగ్రత్తలో వారుంటున్నారు. ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ఏ క్షణాన ఎవరు మీదికొస్తారో తెలియదు. ఎమ్మెల్యేలకి అంగరక్షకులుగా ఉండే గార్డ్స్ కూడా ఒక్కోసారి ఏమీ చేయలేక తమ నాయకుడి ఒళ్ళు చితకబాదుతుంటూ చూస్తూ ఉండిపోయిన సంఘటనలున్నాయి. అందుకే ఈసారి ఏదైనా ఉపద్రవం వస్తే ఎవరి సహాయం లేకుండా తానే ఎదుర్కోవాలని డిసైడ్ అయినట్టు టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఆయన హైదరాబాదు నుండి కరీంనగర్ బయలుదేరుతుండగా ఆయన వెంబడి ఓ పొడవాటి తుపాకీని కూడా తీసుకెళ్ళాడు. ఈ దృశ్యం చూడటానికి కొత్తగా అనిపించినప్పటికీ.. ముందు ముందు కూడా జనాల మధ్యలోకి వెళ్ళే నాయకులు తమ రక్షణ కోసం తామే స్వయంగా ఇలా తుపాకులు వెంటేసుకెళ్ళే రోజులు కూడా వస్తాయేమో… ఏమో..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి