లోకేష్ పోస్టర్స్ ఫుల్ ఎన్టీఆర్ పోస్టర్స్ నిల్


చంద్ర బాబు రాజకీయ వారసుడు లోకేష్ మహానాడు కి శుక్రవారం హాజరు కాలేదు. అయితే లోకేష్ చిత్రాలున్న పోస్టర్స్, కటౌట్లు పెద్ద ఎత్తున  మహానాడులో  కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్స్ కానీ ,కటౌట్లు  కానీ ఎక్కడా లేవు. గత ఏడాది మహానాడు కి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సారి వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు. ఎన్టీఆర్ ని కూడా హాజరు కమ్మని ఆహ్వానం పంపారు. శనివారం మామ అల్లుళ్ళు బాలకృష్ణ ,లోకేష్ మహానాడుకి రావచ్చు అంటున్నారు. వీళ్ళిద్దరే శనివారం స్పెషల్ అట్రాక్షన్ కావచ్చు. చంద్ర బాబే స్వయం గా బాలయ్య ను ఆహ్వానించారు. ఇక రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మహానాడు లో ఏ హడావుడి లేకుండా అంటీముట్టనట్టు గా వున్నారు. గత ఏడాది అన్నీ తానై వ్యవహరించిన హరి ఈ సారి మౌనం గా,గుంభనం గా వున్నారు.మద్యాహ్నం నుంచే ఆయన  ఇంటికి వెళ్ళిపోయారు. నారా లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించడానికి బావ చంద్ర బాబు పావులు కదుపుతున్న తీరు పై ఆగ్రహమే  ఇందుకు కారణమని అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!