జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ (టిడిపీ పోరు)

తెలుగుదేశం మహానాడుకు గండిపేట ఒక పక్క ముస్తాబవుతుండగా, మరో వైపు జిల్లాస్థాయిలో పార్టీ తీర్మానాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు వారసడు ఎవరన్న విషయం గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా నానుతూనే ఉంది. హరికృష్ణ, బాలకృష్ణ…వంటి పేర్లు క్రమంగా మరుగునపడిపోతున్నాయి. ఇప్పుడు యువతకు పెద్దపీట వేస్తూ పార్టీ జిల్లా శ్రేణులు పావులు కదుపుతున్నాయి. చిత్తూరు జిల్లా స్థాయి పార్టీ సమావేశంలో చంద్రగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా చంద్రబాబు తనయుడు లోకేష్ ను నియమించాలని తిర్మానం ఆమోదించారు. సరిగా అదే సమయంలో ఇటు కృష్ణాజిల్లా పార్టీ సమావేశం బందరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ను నియమించాలంటూ తీర్మానం ఆమోదించింది. ఫలితంగా పార్టీ వారసులు ఎవరన్న విషయంలో ఇప్పుడు రెండు ముఖాలు కనబడుతున్నాయి. జూనియర్ ఎన్టీఅర్ లేదా లోకేష్ వీరిలో రేపు పార్టీ పగ్గాలు అప్పజెప్పినా బాలకృష్ణ అభిమానులకు కోపం రావచ్చు. అయితే,
బాలకృష్ణ, చంద్రబాబు వియ్యంకులు కావడంతో బాలకృష్ణ నుంచి వ్యతిరేకత ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికే పలుమార్లు నిరసన బావుటా ఎగురవేసిన హరికృష్ణ మాత్రం శాంతిచకపోవచ్చు. తన కుమారుడు జూనియర్ఎన్టీఆర్ కే పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆయన పట్టుపట్టవచ్చు. గండిపేటలో ఈనెలాఖరులో జరిగే మహానాడులో చంద్రబాబు వారసుడు ఎవరన్న విషయంపై కూడా లోపాయికారీగానైనా చర్చ జరగవచ్చు.
- రాజ్ (హైదరాబాద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!