జగన్ ను గిల్లుతున్న చంద్రబాబు


నేడు తెలుగుదేశం 30వ మ‌హానాడు స‌భ అట్ట‌హాసంగా ప్రారంభ‌మ‌యింది.. స‌భ‌ను ప్రారంభించిన పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు అధ్య‌క్ష ప్ర‌సంగం చేసారు. ఈ ముఫ్ఫై సంవ‌త్స‌రాల‌లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి చేసిన సేవ‌ల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యింద‌ని ద‌య్య‌బ‌ట్టారు. అంతేకాదు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర రెడ్డి పాల‌న‌లో రాష్ట్రం పూర్తిగా భ్ర‌ష్టుప‌ట్టిపోయింద‌ని అన్నారు. తాజాగా ఆయ‌న కుమారు వై.ఎస్‌. జ‌గ‌న్ పార్టీ పెట్టి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించాల‌నే ఏకైక ల‌క్ష్యంతో స్వార్థ‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ద‌య్య‌బ‌ట్టారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా పార్టీ ఏర్పాటు చేశార‌ని, సామాజిక న్యాయం చేస్తాం అని పార్టీ స్థాపించిన చిరంజీవి చివ‌రికి త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏం సామాజిక న్యాయం చేశార‌ని ప్ర‌శ్నించారు. భ‌విష్య‌త్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్ర‌జారాజ్యం పార్టీలాగే అవుతుంద‌ని అన్నారు. జ‌గ‌న్‌కి మ‌ద్ద‌తిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఒక‌రిని పెళ్ళి చేసుకుని మ‌రొక‌రితో అక్ర‌మ‌సంబంధం పెట్టుకున్న వైఖ‌రిలా జ‌గ‌న్‌కి మ‌ద్ద‌తిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ని అభివ‌ర్ణించారు. జగన్ పార్టీ ఎమ్మేల్యేలు అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే మేము మద్దతు ఇస్తామంటూ రెచ్చగొట్టారు.. ప్రభుత్వాలు నిర్మించలేరుకానీ, కూల్చడానకి మాత్రం చంద్రబాబు రెడీ అవుతున్నారు…ఇదో రాజకీయ కుట్ర… మాయాబజార్ లో ఘటోత్కచుని శిష్యులు ఓ మాట అంటారు… `కట్టమంటే కష్టం కానీ, కూల్చమంటే చిటికలో పని…ఇదిగో ఇప్పుడే కూల్చేస్తాం…’ అంటూ విధ్వంసం సాగిస్తుంటారు. అలాగే ఉంది తెలుగుదేశం నాయకుడు, అవతల వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ వైఖరి.
మొత్తం మీద జ‌గ‌న్‌కి మ‌ద్ద‌తిస్తున్న‌ ఎమ్మేల్లేలను తీసుకుని నేరుగా గవర్నర్ దగ్గరకు వ‌చ్చి అవిశ్వ‌స తీర్మానం పెడితే మేము మద్దతు ఇస్తామని జగన్ రెచ్చగొట్టడం,  పీకలమీదకు వచ్చిన తెలంగాణ సమస్యను పక్కదోవపట్టించడానికే అని ద‌య్య‌బ‌ట్టారు. చంద్ర‌బాబు ప్ర‌సంగం అద్యంతం వ్యూహాత్మ‌కంగా జ‌రిగింది. కెసీఆర్ కు చెక్ పెట్టేందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా జగన్ ను రెచ్చగొడుతున్నారు.
చంద్రబాబు నాయుడు రాజకీయంగా వ్యూహాలు రచించడంలో దిట్ట. గతంలో 2009 ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణలో ప్రచారం చేయడానికి పార్టీ లీడర్స్ వెనకాడినప్పుడు చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదిపి రెండుకళ్ల సిద్ధాంతంతో ముందుకు సాగారు. బాబ్లీ వివాదాన్ని భుజాన వేసుకున్నారు. ఇప్పుడు కూడా జగన్ అనే పావును కదపడం ద్వారా అటు కాంగ్రెస్ కూ ఇటు తెరాసకు చెక్ పెట్టాలని చూస్తున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు.
మొత్తానికి మ‌హానాడు స‌భ‌లో ఆయ‌న చేసిన గంట‌ల కొద్ది ప్ర‌సంగంలో కొత్త‌ద‌న‌మేదీ లేదు. వైఎస్ జ‌గ‌న్ ని గిల్లుతూ రెచ్చ‌గొట్టి కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చాల‌నే ఉద్దేశ్యం ఆయ‌న‌లో క‌నిపించింది. ఇటు తెలంగాణ పై కూడా ఆయ‌న పెద్ద‌గా స్పందించిందేమీ లేదు. సొంత పార్టీలో ఉన్న లుక లుక‌ల‌ని క‌ప్పి పుచ్చుకోవ‌డానికి ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై ఎదురు దాడికి దిగి మొత్తానికి త‌న ప్ర‌సంగం పూర్తి చేశాన‌ని అనిపించుకున్నారు.. అంతే..!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!