రాజీవ్ హత్య `అస్త్రాన్ని కదలించిన జయ

మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్న జయలలిత తనదైన స్ట్రైల్ లో డీఎంకెపై విరుచుకుపడుతున్నారు. తన దగ్గరున్న పాత అస్త్రాలను బూజుదులిపి మరీ తీస్తున్నారు. అలాంటి అస్త్రాల్లో ఒకటి – రాజీవ్ హత్యతో డీఎంకె లింక్…మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యతో డీఎంకెకు పరోక్ష సంబంధం ఉన్నదని జయలలిత ఆరోపిస్తున్నారు. డిఎంకె మొదటి నుంచీ బ్రాహ్మణ వ్యతిరేక భావజాలంతోనే నడుస్తోంది. ఈ తరహా భావజాలానికి ప్రేరితమయ్యే ఎల్టీటీఈ రాజీవ్ గాంధీని హత్య చేయాలన్న నిర్ణయం తీసుకుని ఉండవచ్చంటూ ఆ సంస్థ నేత పద్మనాధన్ చేసిన ప్రకటనపై జయలలిత స్పందిస్తూ, ఈ వ్యాఖ్యలు చేశారు. 1991లో రాజీవ్ హత్య జరిగినప్పటి నుంచీ ఎల్టీటీఈ నుంచి తనకు బెదరింపులు వస్తూనే ఉన్నాయని ఆమె చెప్పారు. జయలలిత చేపట్టిన `పగ’  కార్యక్రమాల్లో భాగంగానే డీఎంకె పునరుద్ధరించాలని భావించిన శాసనమండలి (కౌన్సిల్ ) ప్రతిపాదనకు జయ ఇప్పుడు బ్రేక్ కొట్టింది. ఇంకా మున్ముందు ఏమి చేయబోతుందోనని డిఎంకె శ్రేణులు కలవరపడిపోతున్నాయి.
- అజయ్ కుమార్ (చెన్నై)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!