జగన్ భార్య భారతీనే రామ్ పై వేటువేశారా?


వై.ఎస్.ఆర్. నిర్మించిన మీడియా సామ్రాజ్యానికి దాదాపుగా అధినేతగా చెలామణి అవుతున్నసాక్షి సీ.ఈ.ఓ. ప్రియదర్శని రామ్ పై వేటు పడినట్లు సమాచారం. అంతా తన చలవ వల్లనే సాక్షి ఎదిగిందని రామ్ కలర్ ఇవ్వడం జగన్ కుటుంబానికి, ముఖ్యంగా ఆయన భార్య భారతికి, నచ్చలేదని సమాచారం.
రామ్ సోదరుడి డిగా చెప్పబడుతున్న ఒక వ్యక్తీ నడుపుతున్న పోర్టల్ లో రామ్ ను ఆకాశానికి ఎత్తడం,“Image maker Ram Tranformed Jagan in To Biggest Ever Mass Leader of Andhra” అనే పెద్ద వ్యాసం సమస్యకు కారణం అయ్యిందని చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి వుంది.
‘సలాం సాక్షి’ వంటి ప్రోగ్రాంలతో ఛానల్ లో, ‘లవ్ డాక్టర్’ వంటి కాలంతో సాక్షి పేపర్లో రామ్ పేరు తెచ్చుకున్నారు.
నాకైతే లవ్ డాక్టర్ కాలం, నీలాంబరి, అరటిపండు… పరమ వెగటు కలిగిస్తాయి. ఆరు పదులు దగ్గర పడుతున్నా… క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్ళే రామ్ గతంలో ప్రియదర్శిని పేరిట advt కంపనీ నడిపారు. కొన్ని సినిమాలలో నటించిన అనుభవంతో మీడియాలో అనుభవం లేకపోయినా రామ్ అనతి కాలంలో వినుతికి ఎక్కారు. కనిపించిన ప్రతివాడిని అన్నయ్య అంటూనే నోటికి వచ్చింది మాట్లాడి జర్నలిస్టులను రాం ఇబ్బంది పెట్టేవాదన్న అభియోగం వుంది.
“అవును…రామ్ పైన  వేటు పడింది. ఆయన సేవలను పార్టీకి వాడుకోవాలని జగన్ భావిస్తున్నారు,” అని ఆ శిబిరానికి చెందినా ఒక బాధ్యుడైన వ్యక్తి ఈ బ్లాగరుకు చెప్పారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!