ఎవరీ నల్ల తంబీ


ఎవరీ నల్ల తంబీ ?? పేరే విచిత్రం గా వుంది కదా!
అయన గురించి పూర్తిగా తెల్సుకుంటే మరింత ఆశ్చర్య పోతారు. నల్ల తంబీ తమిళనాడు లోని ఎగ్మూర్ కి చెందిన ఓ  సాదా సీదా వ్యక్తీ. ఇంక చెప్పాలంటే  ఆయన  వృత్తి సైకిళ్ళు రిపేర్ చేయడం. అయన మొన్నటి ఎన్నికల్లో  ఒక మంత్రి గారినే ఓడించి ఎమ్మెల్యే అయ్యారంటే న‌మ్ముతారా? కానీ ఇది నిజం. నల్ల తంబీ విజయం ఒక సంచలనం.. ఒక చరిత్ర..
నల్ల తంబీ ప్రముఖ నటుడు విజయ కాంత్ కి వీరాభిమాని. విజయకాంత్ పార్టీ కి ఓ నమ్మకమైన కార్యకర్త. పార్టీ పట్ల నల్ల తంబీకి వున్న అంకిత భావం చూసి ముచ్చట పడి విజయ కాంత్ ఆయనకు ఎగ్మూరు ఎస్సీ టికెట్ ఇచ్చారు. అంతే నల్ల తంబీ  వెను తిరిగి చూడ లేదు. ప్రజల అభిమానాన్ని కూడా గట్టుకట్టుకున్నాడు. మంత్రి ఇళం వలుది ని ఓడించారు. విజయ బావుటా ఎగుర వేసారు
ఇదంతా ఒక ఎత్తు  అయితే  అయన ఇప్పటికి సామాన్యుడిలా జీవించాలనుకుంటున్నారు. అది అయన గొప్ప దనం. ఎమ్మెల్యే పదవి ప్రజాసమస్యల పరిష్కారం కోసమే నా జీవనం  కోసం  సైకిళ్ళు రిపేర్ చేస్తాను అంటున్నారు నల్ల తంబీ. అన్నట్టు అయన పెద్ద చదువులు ఏమి చదవ లేదు. అయన పిల్లలు కూడా ప్రభుత్వ బడి లోనే చదువుతున్నారు.
నిజం గా నల్ల తంబీ గ్రేట్ కదా!
ఆయనను చూసి దేశం లోని ఎమ్మెల్యేలు చాలా చాలా నేర్చుకోవాల్సి వుంది. నల్ల తంబీ ని మరో సుందరయ్య అనొచ్చా?మరో హజారే అనొచ్చా?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!