నేను న్యూడ్‌గానా..? యూజ్‌లెస్ ఫెలోస్..
అంటూ మండిపడింది ఐశ్వర్యారాయ్ బచ్చన్. ఈ మధ్య ఓ హిందీ ఛానల్‌లో ఐశ్వర్యపై ఓ వార్త ప్రసారం జరిగింది. ఆ వార్త ఏమిటంటే.. ఐశ్వర్య ఓ హాలీవుడ్ చిత్రంలో న్యూడ్‌గా నటించనుందని.. ఈ వార్త బాలీవుడ్‌లో పెద్ద సంచలనమైపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఐశ్వర్య ఆ సదురు ఛానల్ వాళ్ళని పిలిపించుకుని మరీ యూజ్‌లెస్ ఫెలోస్.. అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.. ఐష్ మామ అమితాబ్ బచ్చన్ అయితే కోపంతో ఊగిపోయారు. వెంటనే ఆ వార్తని ఐశ్వర్య ఖండించినట్టు ఛానల్స్‌లో రావాలని హుకుం జారీ చేశారు. లేదంటే తాను కోర్టుకు వెళ్తానని, ఆ ఛానెల్‌ను మూయిస్తానని కూడా బెదిరించాడట.. దాంతో సదరు ఛానెల్ వారు ఐశ్వర్య న్యూడ్ గా నటించబోనని, తాను పెళ్ళయిన పడతిని అని తనకీ కొన్ని కట్టుబాట్లు, సంప్రదాయం ఉందని చెప్పిన న్యూస్‌ని ప్రముఖంగా ప్రసారం చేసారు. ఛానెల్స్ మధ్య పోటీ పెరగడంతో ఇలా సెలెబ్రిటీల పరువు ప్రతిష్ఠలని గంగపాలు చేసే వార్తలని సృష్టించి సెన్సేషనల్ న్యూస్‌గా వేయడం ఎంత వరకు కరక్టంటారు..?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి