రోశయ్య ఏమి సాధించినట్లో..?


మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ యాత్ర ఏమి సాధించిందో తెలియదు కాని, ఆయన చెబుతున్నదాని ప్రకారం ఆయనకు గవర్నర్ పదవి రావడం లేదు. అసలు సోనియాగాంధీ ఆ ప్రస్తావన తేలేదంటున్నారు. ఒక్కోసారి రోశయ్య అతి రహస్యం బట్టబయలు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.తను ఏమి చెప్పనని అంటుంటారు. ఢిల్లీ పర్యటనలో అదే చెప్పారు.అయితే అందరికి తెలిసిన పిసిసి పునర్వ్యస్థీకరణ అంశం మాత్రం ప్రస్తావించారు. త్వరలో కొత్త పిసిసి అద్యక్షుడు వస్తారని మాత్రం చెప్పారు. మరిన్ని వివరాలు కోరితే ఆయన తన శైలిలో అన్ని మీకు చెప్పదలిస్తే, మిమ్మల్ని కూడా సోనియా వద్దకు తీసుకువెళ్లి అక్కడే మాట్లాడేవాడేనని అసహనం వ్యక్తం చేశారు.రోశయ్య కు నిజంగానే గవర్నర్ పదవి గురించి ఏమి చెప్పలేదా? అయితే కేవలం పార్టీ రాష్ట్ర వ్యవహారాలపైనే మాట్లాడడానికి పిలిపించారా? అయితే కచ్చితంగా ఈయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై ఫిర్యాదుచేసి ఉంటారు. ఎందుకంటే ఆయన గత కొంతకాలంగా కిరణ్ కు సంబందించి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తు న్నట్లు ప్రచారం జరుగుతోంది.కాగా గవర్నర్ పదవి గురించి హామీ వచ్చిందని అనుకుంటున్నప్పటికీ ఆ విషయం బయటపెట్టడం లేదని అనుకోవాలి. లేదా ఏదైనా సమస్య వచ్చి ఉండాలి. అయితే అమీర్ పేట అవినీతి కేసుకు ఢిల్లీకి సంబందం లేదని మాత్రం అన్నారు. అంతవరకు రోశయ్య జాగ్రత్తపడ్డారనుకోవాలి. ఒకవేళ గవర్నర్ పదవి వస్తున్నా, ఈ కేసు ఇబ్బంది కాదని మాత్రం చెప్పినట్లు అనిపిస్తుంది.రోశయ్య పార్టీ అధినేత్రి సోనియాను కలిసి ఏమి సాధించారో ఆయనకే తెలియాలి.కనీసం నేదురుమల్లి జనార్ధనరెడ్డి తాను ఫలనా విషయం చెప్పానని అన్నారు. రోశయ్యకు ఆ ధైర్యం లేదా?లేదా ఇష్టం లేదా?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!