రేవంత్‌ యూజ్‌లెస్ ఫెలో

రాజకీయనాయకులు కొన్నిసందర్బాల్లో ఆవేశానికి లోనవుతుంటారు. మరికొన్నిసార్లు సంయమనం కోల్పోతుంటారు. మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ నాయకుడైన డాక్టర్ నాగంజనార్థన్‌రెడ్డికి, మొదటిసారి ఎన్నికైన రేవంత్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నాగంకు వ్యతిరేకంగా పార్టీలో పావులు కదిపింది రేవంత్‌రెడ్డేనని నాగం సన్నిహితులు అనుమానిస్తుంటారు. నాగం జనార్థన్‌రెడ్డి అయితే రేవంత్‌తో నేరుగా మాట్లాడడానికి కూడా ఇష్టపడరు . ఎందుకంటే అనేక సమావేశాల్లో రేవంత్‌రెడ్డి నాగం చర్యలను నిలదీస్తుండేవారు. రేవంత్‌రెడ్డి క్రమేపీ చంద్రబాబుకు బాగా సన్నిహితుడయ్యాడని, జిల్లాలో తనకు వ్యతిరేకంగా టిడిపి కేడర్‌ను ఎగదోయడంలో రేవంత్‌రెడ్డి ముఖ్యపాత్ర పోషిస్తున్నాడని నాగం అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమంలో సైతం నాగంను ఆయా సందర్భాల్లో రేవంత్‌ నిలదీస్తుండేవారు. గవర్నర్ ప్రసంగం రోజున వీరిద్దరు పోటీ పడి పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఆ సందర్బంలో గవర్నర్‌ను కుర్చీ లాగి వారంరోజుల పాటు సస్పెండ్ అయ్యారు. తనను సస్పెండ్ చేసినా నాగం పట్టించుకోలేదని, శాసనసభకు వెళ్లి కార్యకలాపాల్లో పాల్గొన్నాడని రేవంత్ విమర్శిస్తుంటారు. తాజాగా కరీంనగర్‌ వెళ్తున్న సందర్బంలో రేవంత్‌రెడ్డి చేతిలో రైఫిల్‌ ఉండటంతో నాగం మండిపడ్డారు. ఈరకంగా ఇద్దరి మధ్య వివాదాల చిచ్చు కొనసాగుతుండగా గురువారం ఉదయం ఎన్టీవీ లైవ్‌షో లో నాగం జనార్థన్‌రెడ్డి , రేవంత్‌రెడ్డిలు ఒకేసారి ఫోన్‌లైన్లోకి రావడం జరిగింది. నాగం ఇంతకాలం చంద్రబాబు పక్కనే ఉండి ఎందుకు మాట్లాడలేదని రేవంత్ ప్రశ్నించగానే, జనార్థన్‌రెడ్డికి పట్టలేని కోపమొచ్చి యూజ్‌లెస్‌ ఫెలో అని రేవంత్‌ను దూషించారు. రేవంత్ మాత్రం ఆ మాట విననట్లే వదిలేశారు. అయితే అంతకుముందు తాను కొంతమంది టీవీల్లో మాట్లాడుతుంటే వారికి సమాధానం చెప్పబోనని రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ మాటయితే అన్నారు కానీ రేవంత్‌-నాగంల మధ్య హాట్‌హాట్‌గా ఓ పదినిముషాల పాటు చర్చ సాగింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!