యోగా సిడిలో అనుష్క నటిస్తోందా?


ఆరోగ్యసమస్యలకు ఏకైక పరిష్కార మార్గంగా యోగా ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆధునాతన కాలంలో పాతకాలంలో చేసిన యోగాయే ఇప్పుడు మన మనశ్శాంతి,శారీరక సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా కనిపించని ఫలితం యోగాలో ఉంటుందని చాలామంది చెప్తుంటారు కూడా. అందుకే దీన్ని మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. అందులో భాగంగా యువతను ఆకట్టుకోవడానికి గతంలో బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టితో యోగా సిడియే చేయించి, యూత్ లో మంచి ప్రచారం కల్పించారు. ఆ తరువాత తెలుగులో ఓ సినిమాలో ఇలియానా కూడా యోగా సీన్ చేసి యువతను ఆ దిశగా ప్రోత్సహించిందనే చెప్పుకోవాలి. తాజాగా తెలుగులో ప్రముఖ హీరోయిన్, యోగా టీచర్ అయిన అనుష్కను యోగా సీడీలో నటించమని ఓ సంస్థ వారు కోరారట.దానికి ఆమె నో చెప్పిందని సమాచారం. యోగా అనేది మహా సముద్రం..అందులో నేను చిన్ననీటి బొట్టుఅంత కూడా నేర్చుకోలేదు. నాకు నేర్పించిన గురువు భరత్ ఠాకూర్( భూమిక భర్త) లాంటి వారు చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్లను ట్రై చేయండి. నాకు ఎంత డబ్బు ఇచ్చినా యోగా వంటి వాటి జోలికి నేను పోను. అదే నాకు ఈరోజు ఈ స్థితికి తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చునని వాళ్లతో చెప్పిందట. పాపం అనుష్క గ్లామర్ ను ఉపయోగించుకొని యోగాను ప్రచారంలోకి తీసుకురావాలనుకున్నవారికి షాక్ ఇచ్చిందట.మీరు చేసే ఏ సామాజిక కార్యక్రమంలోనైనా పాల్గోంటాను కానీ ఇది చేయననేసరికి వారు కాస్త నిరాశగా వెనుదిరిగారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!