హై కమాండ్‌కి అసలు పరీక్ష

ప్రజా రాజ్యం నాయకులు సి.రామచంద్రయ్య, గంటాశ్రీనివాసరావులు ఢిల్తీ వెళ్లారు. మరో వైపు ఆయా పదవులకోసం కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ పెంచారు. మంత్రి కన్నాలక్ష్మీనారాయణ తాను పిసిసి రేసులో ఉన్నానని, ప్రకటించగా, గుంటూరు ఎమ్.పి రాయపాటి సాంబశివరావు ఆయనను వ్యతరేకిస్తూ ప్రచారం ఆరంభించారు.తెలంగాణ నేతను ఎవరిపైనా పిసిసి అద్యక్షుడిని చేయాలని ఆయన కోరారు. వి.హనుమంతరావు అయితే బాగుంటుందని కూడా ఆయన సలహా ఇచ్చారు. కాగా సోనియాగాంధీ సిమ్లా పర్యటనకు వెళుతున్నారు. ఆమె తిరిగి వచ్చాక తుది నిర్ణయం తీసుకోవాలని గులాం నబీ అజాద్ తో జరిగిన సమావేశంలో నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ వ్యవహారాలను సత్వరమే ఒక కొలిక్కి తీసుకురావాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు అర్దం చేసుకోవచ్చని చెబుతున్నారు.హైకమాండ్ పార్టీ వ్యవహారాలపైనే సీరియస్ గా ఉందా? లేక తెలంగాణ అంశాన్ని కూడా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఉందా అన్నదానిపై ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి