అప్పుడే మమత వాగ్దాన భంగం

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎప్పు డు రెడీగా ఉంటుంది ప్రభుత్వ పక్షం చేసే తప్పులను ఎండగట్టడానికి. అది మంచిది కూడా. పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి గా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ పదవీబాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే సిపిఎం కు చెందిన దినపత్రిక గణశక్తి ఒక సంపాదకీయం రాసింది. అప్పుడే మమత బెనర్జీ వాగ్దాన భంగం చేశారన్నది దాని సారాంశం. అదేమిటా, ఇంకా ప్రబుత్వమే పని ప్రారంబించలేదు అనుకుని చదివితే అసలు విషయం బోధపడింది.మమత బెనర్జీ తన ఎన్నికల ప్రసంగాలలో ఒకమాట పలుమార్లు చెప్పారు.పశ్చిమబెంగాల్ లో వృధా వ్యయం పెగిగిపోయిందని, ఆర్దిక పరిస్థితిని చక్కదిద్దడానికి గాను తాను చిన్న క్యాబినెట్ నే ఏర్పాటుచేస్తానని ప్రకటించారు.అనవసరమైన , పనిలేని, పని చేతకాని వాళ్లతో క్యాబినెట్ ను నింపనని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. తీరా అదికారంలోకి వచ్చిన మొదటి రోజే ఆమె 38 మందితో క్యాబినెట్ ప్రమాణం చేయించారు.మరొక తృణమూల్ కాంగ్రెస్ మంత్రిని, కాంగ్రెస్ నుంచి ఐదుగురిని క్యాబినెట్లోకి తీసుకుంటామని ఆమె చెప్పారు. అప్పుడు నిర్ణీత సంఖ్య 44 అవుతుంది. మరి అలాంటప్పుడు ఆమె చిన్న క్యాబినెట్ వాగ్దానం ఏమైందని గణశక్తి నిలదీసింది. ఎన్నికలలో ఘన విజయం సాధించగానే హామీని మర్చిపోయారా అని ప్రశ్నించింది. నిజమే. ఎన్నికలలో ఏవేవో చెబుతుంటారు. అవన్ని జరగాలంటే అయ్యేపనేనా అన్న పరిస్థితి ఏర్పడింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!