భారీ సెట్టింగులు లేన‌ట్టేనా..?


గుణ‌శేఖ‌ర్ సినిమా అంటేనే భారీ సెట్టింగుల‌కి పేరు. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే ఏదో ఒక భారీ సెట్టింగుని మామూలు ప్రేక్ష‌కులు సైతం ఎక్స్‌పెక్గ‌ట్ చేస్తారు. అయితే ఈసారి ర‌వితేజ‌తో చేస్తున్న నిప్పు చిత్రంలో మాత్రం భారీ సెట్టుంగులు లేవంటున్నారు. కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో భారీ సెట్టింగులు వేసి సినిమాకి నిండుద‌నం తీసుకురావాల‌న్న ఆలోచ‌న గుణ‌శేఖ‌ర్‌కి ఉంటుంది. ఆయ‌న భారీ సెట్టింగుల‌తో రూపొందించిన చూడాల‌ని ఉంది. ఒక్క‌డు చిత్రాలు ఘ‌న విజ‌యాలు సాధించ‌గా ఆ త‌ర్వాత వ‌చ్చిన అర్జున్‌, వ‌రుడు చిత్రాలు ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసాయి. ఈ చిత్రాలు ప‌రాజ‌యం పాల‌వ‌డంతో ఆ భారీ సెట్టింగులకు పెట్టిన ఖ‌ర్చు కూడా వృధా అయిన‌ట్టే.. అందుకే వ‌రుడు త‌ర్వాత గుణ‌శేఖ‌ర్‌తో సినిమాలు తీయాలంటేనే నిర్మాత‌లు బెంబేలెత్తిపోయారు. ఈ స‌మ‌యంలో త‌న స్నేహితుడు స‌హ ద‌ర్శ‌కుడు వైవిఎస్‌. చౌద‌రి నిర్మాత‌గా నిప్పు ప్రారంభ‌మ‌యింది. ద‌ర్శ‌క‌నిర్మాత‌గా అపార‌మ‌యిన అనుభ‌వం ఉన్న వై.వి.ఎస్‌. చౌద‌రి సూచ‌న మేర‌కు గుణ‌శేఖ‌ర్ భారీ సెట్టింగుల జోలికి వెళ్ళ‌కుండా నిప్పు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సో.. గుణ‌శేఖ‌ర్‌లో వ‌చ్చిన ఈ మార్పుతో ఆయ‌న‌కి మ‌రిన్ని అవ‌కాశాలు వ‌చ్చే అవ‌కాశం కూడా లేక‌పోలేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!