కలిసుందాం రా.. అన్నా మంత్రులు మాట్లాడరా!

మన మధ్య విబేధాలు లేవని నిరూపిద్దామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార రెడ్డి చేసిన ప్రతిపాదనకు మంత్రులెవరూ స్పందించలేదట. అంతా మౌనంగా ఉన్నారని చెబుతున్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు.పదిహేను సంవత్సరాలుగా మనమంతా మంచి మిత్రులమని ఆయన గుర్తు చేశారు. మంత్రివర్గంలో అబిప్రాయబేధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోందని, దానిని పోగొట్టవలసిన అవసం ఉందని ఆయన అన్నారు. ఏమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కూడా ఆయన సూచించారు. పార్టీ అదిష్టానం ప్రతినిధిగా హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జీగులాం నబీ అజాద్ అందరి అభిప్రాయాలు తీసుకున్న నేపధ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఉంది. ముఖ్యమంత్రి తన క్యాబినెట్ ను సమష్టిగా నడపాలన్న ఆలోచన చేస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఆయన వివాదాలు మర్చిపోయి, అంతా కలిసిపోయి పనిచేద్దామని మంత్రులందరిని కోరారు. అయితే దీనికి ఆయన ముందుగానే ఒక కసరత్తు చేసి ఉండాల్సింది. కొంతమంది మంత్రులతో దీనిపై చర్చించి, వారెవరితోనైనా ప్రతిపాదన పెట్టించి మాట్లాడి ఉండాల్సింది.నేరుగా ఆయన మాట్లాడితే దానిపై ఔనన్నా , కాదన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి వెరూ మాట్లాడలేదు. మీడియా ముందుకు వెళ్లినప్పుడు సంయమనం పాటించాలని కూడా ఆయన కోరారు. ప్రాణహిత, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడానికి కేంద్రం సిద్దంగా ఉందని కూడా ఆయన చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ కి సంబందించి తెలంగాణ తదితర అంశాలలో ఒక క్లారిటీ వచ్చేవరకు, అలాగే, మళ్లీ క్యాబినెట్ ప్రక్షాళన జరుగుతుందన్నవార్తలు వస్తున్నందున, అందులో తమ పరిస్థితి ఏమిటన్నది తేలనంతవరకు ఇలాంటి విషయాలు ఒక కొలిక్కి రావు. అయితే సిఎమ్ ఈ ప్రయత్నం చేయడం ఒకరకంగా మంచిదే. ఎవరితో తగాదా పడకుండా అందరం కలిసి రాష్ట్ర ప్రగతి కోసం పనిచేద్దామని అడిగితే తప్పుపట్టవలసిన పనిలేదు. అయితే మంత్రుల మనసులలో ఒకటి ఉండి ఉండాలి. ముందు కిరణ్ అందరిని కలుపుకుని వెళుతున్నారన్న భావన కలిగిస్తే అప్పుడు తదనుగుణంగా స్పందించవచ్చని వారు అనుకుని ఉండవచ్చు. అయితే ఇలాంటివాటిలో ఒక్క ప్రయత్నంలో కాకపోతే మరో ఒకటి,రెండు ప్రయత్నాలలో కొంత సఫలం కావచ్చు. ఆల్ ద బెస్ట్ టు సి.ఎమ్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!