తెలంగాణ లో నాగం హీరో అవుతారా?

అందరు ఊహించినట్టే జరిగింది. సేనియర్ నేత నాగం ను టీడీపీ నుంచి బహిష్కరించారు. నాగం కూడా సస్పెన్షన్ ను  కోరుకున్నారు  ,చివరికి అదే జరిగింది . దీంతో  టీడీపీ తో నాగం అనుబంధం తెగిపోయింది .ఒక పోలిట్ బ్యూరో సభ్యునిపై వేటు వేయడం ఇదే తొలిసారి .ఇక ఇపుడు నాగం ఏమి చేస్తారు? పార్టీ పెడతారా ??లేక పార్టీ రహిత ఉద్యమం చేస్తారా ??అనేది తేలాల్సి వుంది .పార్టీ రహిత ఉద్యమం వల్ల రాజకీయ ప్రయోజనాలు నెరవే రవు .ఆ విషయం నాగం కి తెలియనిది కాదు .పార్టీ ఏర్పాటుకి నాగం ఇప్పటికే సిద్ధం అయినట్టు సమాచారం .టీ ఆర్ ఎస్ కి పోటీ గా  సొంత పార్టీ తో  తెలంగాణ ఉద్యమం నడపాలని నాగం భావిస్తున్నట్టు తెలుస్తోంది .అలాగే రెడ్డి సామాజిక వర్గాన్ని కలుపుకు పోవాలని యోచిస్తున్నట్టు గా చెబుతున్నారు . అయితే పార్టీ పెట్టి దాన్ని నడపాలన్నా,ఉద్యమం నడపాలన్నా అంత సులభమైన వ్యవహారం కాదు .గతం లో బీసీ నేత దేవేందర్ గౌడ్ కూడా నవ తెలంగాణ పేరిట పార్టీ పెట్టి  చివరకు దాన్ని పీఆర్పీ లో విలీనం చేసి ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయారు .దేవేందర్ ఆశించినట్టు బీసీ లు ఆయనను నమ్మలేదు .చివరకి దేవేందర్ మళ్లీ టీడీపీ లో చేరారు .ఇదిలా వుంటే ఇపుడు నాగం కి మద్దతుగా నిలబడే ఎమ్మెల్యేలు ఎందరు వుంటారు ? నాగం ను సస్పెండ్ చేసే కొద్ది గంటల ముందే  వేణుగోపాల చారి  చంద్ర బాబు ని కలసి పార్టీ లో కొనసాగుతానని హామీ ఇచ్చారు.ఇది నాగం ఊహించని మలుపు .ఇక మిగిలింది హరీశ్వర రెడ్డి ,జొగు రామన్నలే .వీరిని కూడా మేనేజ్ చేసేందుకు ప్రయత్నాలు
జరుగుతున్నాయి .నాగం ను ఒంటరిని చేసేందుకే బాబు ప్రయత్నిస్తారు . ఈ ఆటుపోట్లను తట్టు కొని నాగం ఏమి చేస్తారో కొంత కాలం పోతే గానీ తేలదు .మొత్తం మీద తెలంగాణ లో కేసీఆర్ లాగా  హీరో కావడం అంత సులభమేమీ కాదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!