బద్రీనాథ్‌కి భారీ ఆఫర్..
గీతాఆర్ట్స్ బ్యానర్‌లో మగధీర తర్వాత అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం బద్రీనాథ్. ఈ చిత్రం విడుదలకి ముందే రికార్డ్ క్రియేట్ చేస్తుంది. కేరళలో అల్లు అర్జున్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ నటించిన తెలుగు చిత్రాలు మళయాలంలో డబ్‌చేసి కేరళలో విడుదల చేసిన అన్ని సినిమాలూ విజయం సాధించాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని బద్రీనాథ్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, మళయాలం భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్.. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రం మళయాల రైట్స్ కోసం భారీ ఆఫర్ వచ్చింది నిర్మాతకి. అక్కడి రక్తక్ ఫిలిమ్స్ సంస్థ వారు ఏకంగా ఒక కోటీ పది లక్షల రూపాయలు చెల్లించి ఈ చిత్రం మళయాల రైట్స్ తీసుకున్నారు. ఒక డబ్బింగ్ చిత్రానికి ఇంత పెద్ద మొత్తం చెల్లించడం అన్నది ఇప్పుడు మళయాలం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే అటు తమిళ భాషలో కూడా అల్లు అర్జున్ పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బద్రినాథ్ చిత్రం మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యి మూడు భాషల్లోనూ సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక అల్లు అర్జున్ మార్కెట్ మూడు భాషల్లోనూ ఓ రేంజ్‌లో పెరిగిపోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి