రామోజీ క్షమాపణ చెప్పాలా?

ఈనాడు కన్నడ టివి ఛానల్‌కు సంబంధించి కోర్టును కింఛపర్చే విధంగా సన్నివేశాలున్నాయన్న అభియోగాలతో కోర్టులో కేసు నమోదయింది. ఛానల్ అధిపతి రామోజీరావు, దర్శకుడు సీతారాంపైన జిఆర్‌మోహన్ అనే న్యాయవాది కోర్టులో కేసు దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా రామోజీరావు ఒక్కసారి కూడా వాయిదాకు హాజరు కాకపోవడంతో నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లు జారీ అయ్యాయి. దీంతో రామోజీరావు గత నెల 12న కోర్టుకు హాజరై తనకు కన్నడ భాష తెలియదని జవాబు చెప్పారు. భాష తెలియనప్పుడు ఛానల్ ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. ఆ మీదట రామోజీ క్షమాపణ కోరుతూ కోర్టుకు ఒక పత్రాన్ని పంపించారు. అయితే అందులో చివరన క్షమాపణలకు షరతులు పెట్టారంటూ జడ్జిలు అభ్యంతరం చెప్పారు. ఏకవాక్యంతో భేషరతు క్షమాపణ చెప్పాలని, లేదంటే అక్కర్లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఎన్నో సామాజిక సమస్యలుంటే కోర్టును కింఛపర్చే విధంగా ఎందుకు సీరియల్స్ తీస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. బేషరతు క్షమాపణ చెప్పడానికి రామోజీకి మరోవారం రోజులు గడువు ఇచ్చింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!