31, ఆగస్టు 2011, బుధవారం

ఖైర‌తాబాద్ గ‌ణేశుడికి గ‌వ‌ర్న‌ర్ పూజ‌లు


ఖైరతాబాద్ వినాయకుడిని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ స్వాగతం పలికారు. విఘ్నేశ్వరుడు రాష్ట్రాన్ని అన్ని విఘ్నాలు తొలగించి ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నానని నరసింహన్ అన్నారు. విఘ్నేశ్వరుడు అందరిని కాపాడాలని ప్రార్ధిస్తున్నానని తెలుగులో ప్రసంగించారు. సికింద్రాబాద్ ఎమ్.పి అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నరసింహన్ ప్రజలందరిని దీవించారని కృతజ్ఞతుల తెలిపారు. ఖైరతాబాద్ లో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా వినాయక ్ప్రతిష్ట చేస్తారు. నిమజ్జనం వరకు అక్కడ భారీగా భక్తులు తరలివచ్చి పూజలు చేసుకుంటారు. ఆ తర్వాత నిమజ్జనంలో ఈ గణేషుడికి ప్రత్యేకత ఉంటుంది.హైదరాబాద్ లో గణేషుడు అంటే ఖైరతాబాద్ గణేషుడే అని ప్రజలంతా భావిస్తారు.

21 పత్రాలు – శాస్త్రీయ నామాలు


వినాయకచవతినాడు 21 పత్రితో గణనాధుడ్ని పూజచేయడం ఆచారంగా వస్తున్నది. ఈ 21 పత్రాలు ఇరువైఒక్క ఔషధ మొక్కల నుంచి సేకరిస్తారు. వాటి వృక్షశాస్త్ర నామాలు మీకోసం ఇస్తున్నాం. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, వృక్షశాస్త్ర విశిష్టతను గుర్తుచేసే పండుగ ఇదే. భారత దేశం గర్వించతగ్గ ఆయుర్వేదం వనమూలికలతో కూడినదే. అలాగే, అనేక పండుగల అంతరార్ధం సర్వేజనసుఃఖినోభవంతు అనే…మహాగణపతి పూజ కూడా అలాంటిదే.

పత్రి పేర్ల                                                  శాస్ర్తియ నామం                                          తెలుగు పేరు


మాచీ పత్రం                                           Artemisia.vulgaris
మాఛిపత్రి
బృహతీపత్రం                                        
Solanum.indicum                                           బృహతీపత్రం
(ములక)

బిల్వపత్రం                                            Aegle.marmelos                                                భిల్వం
(మారేడు)

దూర్వాయుగ్మం                                   cyandon.Dactylon                                            (శే్వత)

గరిక                                                     cyandon.linearis                                                (నీల)

దత్తూర పత్రం                                        Datura.stramonium                                            ఉమ్మెత్త

బదరీపత్రం                                            Zizyphus.jujuba                                                 గంగరేగ (రేగు)

అపామార్గపత్రం                                    Achyranthes.Aspera                                           ఉత్తరేణి

తులసి పత్రం                                       Ocimum Sanctum                                               తులసి

చూతపత్రం                                          Mangifera.Indica                                                మామిడి

కరవీర పత్రం                                        Nerium.Odorum                                                గన్నేరు

విష్ణుక్రాంత పత్రం                                 Evolvulus.Alsinoides                                          అపరాజిత

దాడిమి పత్రం                                      Punica.Granatum                                                దానిమ్మ

దేవదారుపత్రం                                    Cedrus.Deodara                                                 దేవదారు

మరువక పత్రం                                    Origanum.Majorana                                           మరువం

సింధువారపత్రం                                  Vitex.Negundo                                           సింధువారం (వావిలా)

జాజి పత్రం                                           Jasminum.Auriculatum                                          జాజి

గండలీ పత్రం                                       Cynodon.Dactylon                                                సర్పాక్షి

శమీ పత్రం                                          Prosopic.spicigera                                                  జమ్మి

అశ్వత్థ ఫత్రం                                      Ficus.Religiosa                                                         రావి

అర్జున ఫత్రం                                      Terminalia.Arjuna                                                     మద్ది

ఆర్క పత్రం                                       
Pterocarpus.Santalinus                                             జిల్లేడు

- తుర్లపాటి నాగభూషణ రావు, ఎం.ఎస్సీ (బోటనీ)

కోరిన‌వ‌రాలిచ్చే కాణిపాకం విఘ్నేశ్వరుడుదేవగణాలకు అధిపతిగా అవతరించిన వినాయకుడు ఈ కాణిపాక క్షేత్రంలో స్వయం భువ విఘ్నేశ్వరుడుగా బావి నుంచి ఉద్భవించాడు. దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల పాలిట కొంగు బంగారమై ఉద్ధరిస్తున్నాడు. సత్య ప్రమాణాలకు ప్రతీకగా, మానవ పరివర్తనకు మూలస్థానంగా భాసిల్లుతున్న ఈ కాణిపాక క్షేత్రం శాతవాహనుల కాలం నుంచే విశేష పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం. ఒక చారిత్రక సత్యం.
పుణ్యక్షేత్రాలకు నెలవైన చిత్తూరు జిల్లాలో తిరుమల, శ్రీకాళహస్తిల తరువాత కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చెప్పుకోదగ్గ అపురూప పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి వెయ్యి ఏళ్ళ చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సత్య ప్రమాణా లకు నెలవుగా ఉంది. జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణానికి 12 కి.మీ దూరంలో బహుదా నది ఒడ్డున పచ్చని పంట పొలాల మధ్య వెలసిన ఈ క్షేత్రంకు వింత గొలిపే పురాణ ప్రాశస్త్యం ఉంది.

బావిలో దేవుడు

ఇక్కడ వెలసిన వినాయకుడు స్వయంభువుడు. బావిలో నుంచి దిన దిన ప్రవర్థమానంగా పెరుగుతున్నాడన్నది భక్తుల నమ్మకం. ఇది నిజమనడానికి ఆధారాలు ఉన్నాయి. వెయ్యి ఏళ్ళ క్రితం చోళ రాజుల ఏలుబడిలో ఉన్న ఈ కాణిపాకం అప్పుడు విహారపురి అని పిలవబడేది. ఈ గ్రామంలో పుట్టుకతో మూగ, చెవుడు, గ్రుడ్డి వారైన ముగ్గురు సోదరులు ఉండేవారు. వీరికున్న కాణి విస్తీర్ణం (25 సెంట్ల భూమి) ద్వారా వ్యవసాయమే జీవనాధారం.
వీరు ఈ స్థలంలోనే ఒక బావిని త్రవ్వుకుని అందులో యాతం ద్వారా నీటిని తోడి భూమి సాగు చేసుకునే వారు. ఒకసారి వర్షాభావం కారణంగా బావిలో నీరు తగ్గడంతో వీరు బావిని త్రవ్వడానికి ఉపక్రమించారు. ఇలా త్రవ్వుతూ ఉండగా బావిలో నుంచి ఠంగ్ మని శబ్దం వినిపించడంతో ముగ్గురు సోదరులు బావిలో ఉన్న రాయిని గమనించి దానిని తొలగించడానికి గడ్డపార, పార ఉపయోగించారు. గడ్డపార రాయి మీద పడగానే రక్తం చిమ్ముకుని పైకి ఎగసిందట.
ఆ రక్తం వికలాంగులైన సోదరులకు తగలడంతో వారి అంగవైకల్యం పోయిందట. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు బావిని మరి కొంత లోతుకు త్రవ్వగా గణనాధుని విగ్రహం బయట పడిందట. దీంతో ప్రజలు భక్తి పారవశ్యంతో టెంకాయలను సమర్పిం చారు. విశేషంగా పగిలిన టెంకాయల నీటి ద్వారా గుడ్డి, మూగ, చెవుడు సోదరుల కాణి భూమి అంతా ప్రవహించింది. దీంతో కాణి భూమి పారిన ఈ స్థలానికి కాణి పారకం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది కాణిపాకంగా మారింది. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళత్తుంగ చోళుడనే రాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి. అప్పటి నుంచి బావిలోని వినాయకుడు క్రమంగా పెరుగుతూ ఉన్నాడని ప్రజల విశ్వాసం.

ప్రమాణాలకు, పరివర్తనకు నెలవు

కాణిపాకం స్వయంభు వరసిద్ది వినాయక స్వామి ఆలయం సత్యప్రమాణాలకు, మానవ పరివర్తనకు నెలవుగా భాసిల్లుతోంది. పురాణ పురుషుడైన శ్రీ వరసిద్ధి వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత. ఎటువంటి వివాదాలు వచ్చినా, నేరారోపణలు జరిగినా నిర్దోషిత్వం నిరూపణకు కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అన్న మాటలే వినిపిస్తాయంటే స్వామి వారి మీద భక్తులకు ఉన్న నమ్మకం అర్థమవుతుంది. స్వామి వారి ముందు తప్పుడు సాక్ష్యమిచ్చిన వారు వెంటనే తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తారన్నది ప్రజల ప్రగాఢ నమ్మకం.
అందుకే ఈ ఆలయంలో సత్య ప్రమాణాలు బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీగా కొనసాగుతున్నాయి. ఇక్కడి ప్రమాణాలకు ఆంగ్లేయుల కాలంలోని న్యాయస్థానాలలో కూడా అత్యంత విలువ ఉండేది. దురలవాట్లకు బానిసలైన వారిని కూడా స్వామి వారి సన్నిధిలో చేసే ప్రమాణాలు పరివర్తులను చేస్తున్నాయి. దురలవాట్లు మానుకొంటామని ఇక్కడ ప్రమాణం చేసి ఎందరో పరివర్తన చెందారు.

పర్యావరణ గణపతి


మహాగణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలను పొందుపరిచారు మన పూర్వీకులు. వినాయక చవితి పూజా విధిలో ఈ సూత్రాలను పాటిస్తుంటాం…
1. కొత్త మట్టితో వినాయకున్ని తయారుచేయడం
2. ఇరువైఒకటి పత్రాలతో పూజ చేయడం
3. నవరాత్రుల అనంతరం పత్రితోసహా వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడం.

శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు. ఆయన జన్మంలోనే పర్యావరణ రహస్యం దాగుంది. నలుగుపిండితో తయారైన బొమ్మకు ప్రాణప్రతిష్ట చేసింది ఆది శక్తి పార్వతీదేవి. అనంతరం, ఏనుగు తలను అతికించి పునఃప్రాణప్రతిష్ఠ చేశారు ఆదిదేవుడు పరమేశ్వరుడు. ఆనాటి నుంచి యుగాలు దొర్లుతున్నా, కాలం మారుతున్నా, మహాగణపతి పూజలందుకుంటూనే ఉన్నాడు.
సమాజంలో అనేక వర్గాలవారుంటారు. వారందరినీ, కలిపి మానవత్వమే మహా మతం అన్న ఏకైక నినాదంతో కూడుకున్నదే మహాగణపతి పూజ. ఈ సృష్టిలో సర్వజీవులు సమానమే అని చాటిచెప్పడమే వినాయక జనన రహస్యం. మానవ రూపంలో ఉన్న వినాయకునికి గజ శిరస్సు అమర్చడం, ఆపైన మూషికుడ్ని (ఎలుకను) వాహనంగా అమర్చడంలోనే సర్వప్రాణులు సమానమనే అర్థం స్ఫురిస్తోంది. ఆహారంగా ఔషధ మొక్కల ఆకులు తినడంలోనే పర్యావరణ రహస్యం దాగుంది.

మట్టి వినాయకుడు- అసలు రహస్యం
అలాంటి వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని చెప్పేవారు పూర్వీకులు. కొత్త మట్టి అంటే, తొలకరి జల్లులు పడిన తరువాత మట్టివాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్థం. ఈ మట్టిని వినాయకచవతికి ముందే, అంటే, వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు. మట్టి తవ్వాలంటే, సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకే వెళతారు. అలా చేయాలనే ఈ పనిని పురమాయించారు పెద్దలు. వర్షాకాలం వచ్చిందంటేచాలు, చెరువులు, వాగులు, కుంటలు నిండిపోతాయి. మరీ ఎక్కువగా వానలు పడితే, పక్కనే ఉన్న ఊర్లు మునిగిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే, చెరువులకు, వాగులకు, కుంటలకు పూడికలు తీయాలి. నీరు నిల్వఉండాలేకానీ, అవి ఊర్లమీద పడకూడదు. వానల వల్ల మట్టి కొట్టుకెళ్ళి చెరువుల్లో చేరిపోతుంటుంది. కాబట్టి ముందుగా పూడిక తీయాల్సిందే. ఆపని పూర్వం రోజుల్లో గ్రామస్థులే చేసేవారు. అలా చేసేందుకు, ఉత్సాహంగా ఆ పని పూర్తి చేసేందుకు మతపెద్దలు వినాయక ప్రతిమలను మట్టితోనే చేయాలన్న నిబంధన పెట్టారు.
పత్రి పూజ – రహస్యం
గణనాథుడ్ని 21 పత్రితో పూజించడం ఆచారంగా వస్తున్నది.   అలా తొమ్మిది రోజులు చేయమని కూడా శాస్త్రం చెబుతోంది. పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవి ఔషధమొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలేకానీ, వేరేవాటితో చేయకూడదు.  ఔషధ పత్రాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయి. వైరస్, బాక్టీరియా వంటి వాటివల్ల ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిది రోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు. ఏ మందైనా డాక్టర్ ఇచ్చేటప్పుడు మూడు రోజులో, వారం రోజులో వాడమని చెప్పినట్టుగానే, పూర్వీకులు పత్రిలోని ఔషధ గుణాలతో ఊరు బాగుపడాలంటే, తొమ్మిది రోజులు పూజలు చేయమని చెప్పారు. ఇదే అసలు రహస్యం.
నిమజ్జనం – అసలు రహస్యం
నవరాత్రుల తరువాత వినాయక ప్రతిమను సమీపంలోని చెరువులోనో, లేదా కుంటలోనూ నిమజ్జనం చేయడం కూడా ఆచారంగానే వస్తున్నది. చెరువులు, కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక, 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ ను జలంలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బాక్టీరియా నశిస్తుంది. అంతేకాదు, ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగున్న పర్యావరణ పరమ రహస్యం.

- తుర్లపాటి నాగభూషణ రావు,ఎంఎస్సీ (బోటనీ)

జగన్ ఏం చేయబోతున్నారు?


షాక్ మీద షాక్… కేసు మీద కేసు…ఉచ్చు పక్కనే ఉచ్చు…ఇదీ కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తాజా పరిస్థితి. ఒక పక్క సీబీఐ దర్యాప్తు, మరో పక్క ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగడంతో జగన్ ఇరకాటంలో పడ్డారు. దీంతో భవిష్యత్ ఎలా ఉండబోతుందన్నది అద్దంలో కనిపిస్తున్నట్టు ఫీలైపోతున్నారు. సీబీఐ దర్యాప్తు సాగుతున్నా తన కంపెనీల్లో సోదాలు ముమ్మరం చేసినా పైకి నదురుబెదురు కనిపించకుండా ఓదార్పు యాత్రని కొనసాగిస్తూ వచ్చిన జగన్ కు మంగళవారం  (30-08-11) రాత్రి మరో షాక్ తగిలింది. ఈడీ కూడా చురుగ్గా స్పందించింది. సీబీఐ ఇంతకు ముందు ఎఫ్.ఐ.ఆర్ ను తయారుచేసినట్టుగానే, ఈడీ కూడా ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (దీన్నే ఇసీఐఆర్ అంటారు) ను నమోదు చేసింది. పైగా, జగన్ ను ప్రధాన నిందితునిగా పేర్కొన్నారు. ఈయనపై పెట్టిన కేసులు కూడా సామాన్యమైనవి కావు. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ – పీఎంఎల్ సీ), విదేశీ ద్రవ్య నిర్వాహక చట్టం (ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ – ఫెమా) కింద కేసులు నమోదు చేశారు. కఠిన ఈ చట్టాల కింద నేరం రుజువైతే జగన్ జైలు కెళ్లక తప్పదు. కేసు బలంగా ఉండటంతో జగన్ లో వణుకు మొదలైంది. నిన్నమొన్నటి వరకు ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని రాజకీయంగా పావులు కదిపిన జగన్ ఇప్పుడు ఎలాంటి వ్యూహం రచించబోతున్నరాన్నదే అసలు ప్రశ్న.
భవిష్యత్ కార్యాచరణపై చర్చలకు రమ్మంటూ జగన్ తన సన్నిహితులు, హితులకు ఇప్పటికే కబురు పంపారు. వైఎస్సార్ వర్ధంతి తరువాత ఏ క్షణంలోనైనా ఈడీ కేసు కింద జగన్ అరెస్ట్ అవడం ఖాయమన్న వాదనలు వినబడుతున్న తరుణంలో జగన్ తన వాళ్లను దగ్గరకు తీసుకోవడంలోని ఆంతర్యం బయటపడుతూనే ఉన్నదని ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్నారు. జగన్ పైకి బింకంగానే ఉన్నప్పటికీ, లోపల జంకు మొదలైందనీ, ఇందుకు సంకేతంగానే సన్నిహితులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడమని ఆ నాయకుడు చెప్పారు. ఇప్పటికే జగన్ అనేక మంది స్వయంగా ఫోన్లు చేసి హైదరాబాద్ లో పెట్టే సమావేశానికి రావాలంటూ కోరారు. ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన కంటే, ఒక వేళ తాను అరెస్టయితే, పార్టీని రక్షించుకోవడం, పార్టీని బలపరచేందుకు ఎవరిని నియమించాలన్నది ఖరారు చేయడం సమావేశం ముఖ్యోద్దేశం కావచ్చని కూడా అనుకుంటున్నారు.
అయితే, జగన్ కు ఇప్పటికీ ఛాన్స్ మిగిలే ఉన్నదనీ, ఆయన కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద లొంగిపోతే సమస్య వీగిపోతుందని కూడా అనుకుంటున్నారు. కానీ, జగన్ మనస్తత్వం ఇందుకు వ్యతిరేకం. మడమతిప్పని నేతగా ప్రజాబలం సంపాదించుకున్న జగన్ ఇప్పుడు సడన్ గా ప్లేట్ తిప్పేయడనీ, అవసరమైతే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కుంటారని ఆయన వర్గం వారు చెబుతున్నారు.
మొత్తం మీద జగన్ పరిస్థితి ఇరకాటంలో పడిందన్న సంకేతాలే ఎక్కువగా అందుతున్నాయన్నది జగమెరిగిన సత్యం.
– ఎన్నార్టీ

వినాయక పత్రి – ఆరోగ్య రహస్యం


వినాయక చవతినాడు 21వ పత్రితో పూజచేయాలి. అయితే, ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. గణపతికి ఏ పత్రాలు ఇష్టమో వాటితోనే పూజించాలేకానీ, ఏ ఆకులు, కొమ్మలు దొరికితే, వాటితో పూజించకూడదు. ఎందుకంటే, ఏనుగులు ఆకులు తింటాయి …. నిజమే. కానీ కొన్ని ఆకులు ముట్టుకోవు. వాటితో పూజిస్తే, వినాయకునికి సంతోషం కలగదు సరికదా… కోపం వస్తుంది. అందుకే, 5amnews.com మీకోసం బొజ్జ గణపయ్యకు ఏ పత్రి ఇష్టమో వాటి గురించీ, వాటిలోని ఆరోగ్య రహస్యం గురించి అందజేస్తున్నది. మరి మీరూ చదవండి…

ఏకవింశతి అంటే 21 రకాలు అన్నమాట.వీటి గురించి తెలుసుకుందాం. అంతేకాదు, ఈ పత్రితోనే పూజను సరిపెట్టుకోవాలి. ఆ విషయం మరిచిపోకండి…
1. బృహతి పత్రం (వాకుడు ఆకు) :- ఇది ఉబ్బసాన్ని తగ్గిస్తుంది.
2. మాచి పత్రం (ధవనం):- ఒతిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.
3. బిల్వపత్రం (మారేడు ఆకు) :- మధు మేహం,విరేచనాలకు విరుగుడుగా పని చేస్తుంది.
4. దూర్వ పత్రం (గరికె గడ్డి) :- రోగ నిరోధకంగా పని చేస్తుంది.
5. దత్తుర పత్రం (ఉమ్మేత):- ఊపిరితితులను వ్యకోచింపచేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది.
6. బదరి పత్రం (రేగు ఆకు):- చర్మ వ్యాధులకు మంచి విరుగుడు.
7. తుర్యా పత్రం(తులసి):- శరీరంలో ఉష్ణాన్ని నియమ్త్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు.
8. అపామార్గ పత్రం(ఉత్తరేణి): దగ్గు ,ఉబ్బసంకి బాగా పని చేస్తుంది.
9. చూత పత్రం(మామిడి ఆకు):- నోటి దుర్వాసన,చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది.
10. జాజి పత్రం(జాజి ఆకు):- చర్మ రోగాలు,స్త్రీ సంభంద వ్యాధులకు మంచిది.
11. గండకి పత్రం(అడవి మొల్ల యుధిక):- అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది.
12. అశ్వత పత్రం(రావి ఆకు): చాల ఓషధగుణాలు ఉన్నాయి.
13. అర్జున పత్రం(మద్ది ఆకూ):- రక్త స్తంభనం,గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారి.
14. అర్క పత్రం(జిల్లేడు ఆకూ) :- నరాల బలహీనత ఉన్నవరికిది దివ్య ఒషధం.చర్మ వ్యాధులను నివారిస్తుంది.
15. విష్ణు క్రాంతం(పొద్దు తిరుగుడు):- దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది.
16. దాడిమ పత్రం(దానిమ్మ ఆకూ):- వాంతులు,విరేచనాలు,అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.
17. దేవదారు(దేవదారు):- శరీర వేడిని తగ్గిస్తుంది.
18. మరువాకం(మరువం):- మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
19. సింధువార పత్రం(వావిలాకు):- కీల్లనోప్పులకు మంచి మందు.
20. శమీ పత్రం(జామ్మీ చెట్టు):- నోటి వ్యాధులను తగ్గిస్తుంది.
21. కరవీర పత్రం(గన్నేరు):- గడ్డలు,పుల్లు తగ్గటానికి దీని వేరు,బెరడు వాడతారు.
తనకిష్టమైన ఈ ఇరువది ఒక్క పత్రాలతో పూజించడం వల్ల ఆరోగ్య రహస్యాలు తెలుసుకుంటారన్నదే గణనాధుడు వినాయక వ్రతం ద్వారా మనకిదిస్తున్న దివ్య ఆరోగ్య సందేశం.

- ఎన్.ఆర్. తుర్లపాటి

గ‌వ‌ర్న‌ర్‌గా రోశ‌య్య ప్ర‌మాణ స్వీకారం


రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన కొణజేటి రోశయ్య.. తమిళనాడు 22 వ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్.. రోశయ్యతో ప్రమాణస్వీకారం చేయించారు. సరిగ్గా రెండేళ్ల క్రితం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇప్పుడు గవర్నర్ గా పదవీ ప్రమాణం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇదే చివరి పదవి అని చెప్పిన రోశయ్య.. ఇన్నాళ్లూ ఎలాంటి వేషధారణలో ఉన్నారో.. తమిళనాడు గవర్నర్ పదవిలోనూ అదే కట్టూ బొట్టుతో కనబడ్డారు. గవర్నర్ పదవిలో రోశయ్య మొత్తం మారనున్నారని.. సూట్ వేసుకుంటారనే ప్రచారం జరిగింది. కాగా.. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జయలలితతో పాటు.. ఆ రాష్ట్ర ప్రముఖులు పాల్గొన్నారు. ఇక మన రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు.. అభిమానులు పాల్గొన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, డీఎస్, చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రంజాన్ పండుగ విశిష్ట‌త‌..


వివేకపు ద్వారాలు తెరచి సౌహార్ద సమభావాల్ని పంచాలనే దైవ ఆదేశాన్ని పాటించడానికి అమలిన హృదయాలతో ఒకరికొకరు సహాయపడాలి. ఇందుకు సామూహిక శక్తి అవసరం. ఈ శక్తిని కలిగించేది నమాజ్‌. దుష్టచింతనల్ని, దురాగ తాల్ని, కుహనా సంస్కారాన్ని నమాజ్‌ ఎదుర్కోగలదు. సత్ప్రవర్తనను నేర్పించ గలదు. ‘సత్ప్రవర్తనగల వ్యక్తి సర్వేశ్వ రుని దృష్టిలో అందరికన్నా మిన్న’

(ఖుర్‌ఆన్‌ 49:13)

ఈద్‌ను శ్రామికుని వేతనం లభించే రోజు అని ఖురాన్‌ విస్పష్టం చేసింది. నెలరోజులు కఠోరవ్రతం పాటించినవారి శ్రమకు పరిపూర్ణ ప్రతిఫలం ఈరోజే లభిస్తుందని విశ్వాసం. పర్వదినాన ఉదయం స్నానపానాదులు ముగించుకొని నూతన వస్త్రాలు ధరించి సుగంధం, పన్నీరు పూసుకొని ‘తక్బీర్‌’ పఠిస్తూ ఈద్‌గాహ్‌ (పండుగ నమాజ్‌ చేసే స్థలం) చేరుకుంటారు. అక్కడ ప్రార్థన చేస్తారు. ‘ఇహ్‌దినస్సిరాతల్‌ ముస్తఖీమ్‌’ (మాకు సన్మార్గాన్ని చూపు). సమస్త మానవాళి హృదయాల్ని సద్బుద్ధితో నింపాలని కోరతారు. ఈద్‌గాహ్‌లో నమాజ్‌ పూర్తి అయిన అనంతరం అక్కడ సమావేశమైన వారిలో వీలైనంత ఎక్కువమందిని కలిసి సుహృద్భావంతో చేతులు కలుపుతారు. హృదయాలు సన్నిహితమవుతాయి. సద్గుణాల పరిమళం పరిఢవిల్లుతుంది. ఈద్‌ ముబారక్‌ (ఈద్‌ శుభాకాంక్షలు) తెలియజేసుకొంటారు. అనంతరం ముస్లిమేతర సోదరుల్ని ఇంటికి ఆహ్వానిస్తారు. అమితానందంతో పరస్పరం ఆలింగనం చేసుకొంటారు. విందు ఆరగిస్తారు. ఈద్‌ మిలాప్‌ సమావేశాలు ఏర్పాటుచేస్తారు. ఇవన్నీ మతసామరస్యానికి, పరస్పర సదవగాహనకు, సమైక్యతకు ప్రతీకలు. మతసహనం మానవలోకానికి మణికిరీటంగా భాసిస్తే, మనిషి మనిషిగా జీవిస్తే భగవంతునికి ఎనలేని హర్షం. ప్రతి వ్యక్తి నిస్వార్థ సేవ చేస్తే జీవితంలోని వాస్తవిక ఆనందం బోధపడుతుంది. ఇతరుల శ్రేయంకోసం జీవిస్తే అది విరాటజీవనంలో పదార్పణమవుతుంది. అప్పుడే సర్వేశ్వరుడు మన జీవితాలకు సాఫల్యం సమకూరుస్తాడు. తన హృదయ వైశాల్యాన్ని ప్రతి వ్యక్తీ లోకానికి చాటినప్పుడే జన్మకు సార్థకత, సంపూర్ణత. అది డబ్బు గడించడంవల్ల రాదు. కోరికలు నెరవేర్చుకోవడంవల్ల ఒనగూడదు. ఇది అనంత జీవిత సత్యం, పర్వదినాల సారాంశం.

ఈడీ కేసులో అరెస్ట‌యితే..


వైఎస్ జ‌గ‌న్ ఆస్తుల విష‌యంలో ఇప్ప‌టికే సిబిఐ సోదాలు మ‌మ్మురంగా సాగిస్తున్నాయి. జ‌గ‌న్‌, ఎమ్మార్‌లు చాలా అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు అంచ‌నాకి రావ‌డంతో ఇప్పుడు ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కూడా రంగంలోకి దిగింది.. అత్యంత కఠినమైన అక్రమ నిధుల చలామణి నిరోధక చట్టం-2002 (పీఎంఎల్ఏ), విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద మంగళవారం జగన్, ఎమ్మార్‌లపై వేర్వేరు కేసులు నమోదు చేసింది. దీంతో జ‌గ‌న్ మ‌రింత చ‌క్ర‌బంధంలో ఇరుక్కున్న‌ట్టే.. ఈ కేసుల్లో అరెస్టయితే… బెయిలు దొరకడమూ కష్టమే! బ్యాంకు ఖాతాల స్తంభన, ఆస్తుల జప్తు… సరేసరి! 2జీ కుంభకోణం కేసులో పలు కంపెనీలకు చెందిన రూ.230 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు, బ్యాంకు ఖాతాల స్తంభనకు ఈడీ మంగళవారమే ఆదేశించింది. జగన్ కేసులోనూ ఇది జరగక తప్పదని తెలుస్తోంది. ఎందుకంటే… ఈ కేసులో పీఎంఎల్ఏ, ఫెమాల ఉల్లంఘన జరిగినట్లు సీబీఐ ఇప్పటికే జరిపిన విచారణలో స్పష్టమైన ఆధారాలు లభించాకే… ఈడీకి కేంద్ర ఆర్థిక శాఖ ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్… ఆర్థిక నేరాల దర్యాప్తునకు సంబంధించిన అత్యున్నత సంస్థ. ఇది కేంద్ర ఆర్థిక శాఖ పర్యవేక్షణలో పనిచేస్తుంది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారంతా సీబీఐ విచారణతోనే ముచ్చెమటలు కక్కుతున్నారు. ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశంతో వీరికి మరిన్ని కష్టాలు తప్పవ‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ కంపెనీల‌లో సిబిఐ సోదాలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ మాత్రం ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే ఉంటున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ త‌న‌పై పెట్టిన కేసులు క‌క్ష‌సాధింపు చ‌ర్యే అని ద‌య్య‌బ‌డుతున్నారు. తాజాగా ఈడీ కేసులు కూడా నమోదు కావ‌డంతో జ‌గ‌న్ వ్యూహం ఎలా ఉండ‌బోతోంది. ఈడీ కేసులో జ‌గ‌న్ జైలుకి వెళ్ళ‌డం అనివార్య‌మేనా..?  ఒక‌వేళ జ‌గ‌న్ జైలుకెళ్ళాల్సి వ‌స్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతోంది..?  అని ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఉత్కంఠ నెల‌కొని ఉంది.

ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లుముఫ్పైరోజుల పాటు క‌ఠోర ఉప‌వాస దీక్ష చేసి నేడు రంజాన్ పండుగ‌ని జ‌రుపుకుంటున్న ముస్లీం సోద‌ర‌సోద‌రీమ‌ణుల‌కు రంజ‌న్ ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు. హిందూ ముస్లింలు భాయి, భాయి అన్న నానుడిని అనుస‌రిస్తూ అంద‌రమూ క‌లిసి మెలిసి ఉంటూ ప్ర‌పంచ దేశాల‌కి శాంతి సందేశాన్ని పంపుతుండ‌డం మ‌న భార‌త‌జాతికి ఎంతో గ‌ర్వ‌కార‌ణం. ఇది ఇలాగే కొన‌సాగిస్తూ హిందూ ముస్లింలు ఎప్పుడూ క‌లిసి మెలిసి ఉండాలంటూ మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ… మ‌రొక‌సారి ముస్లిం సోద‌రుల‌కి రంజాన్ ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు

భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌లో జ‌గ‌న్‌


భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపేందుకు వై.ఎస్.జగన్ తన సన్నిహితులు,తన కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో సెప్టెంబర్ ఒకటిన ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు.తొలుత బుధవారం రాత్రి సమావేశం జరపాలనుకున్నా, దానిని సెప్టెంబరు ఒకటికి వాయిదా వేసుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్వయంగా జగన్ పలువురికి ఫోన్ చేసి హైదరాబాదులో అందుబాటులో ఉండవలసిందిగా కోరడం.ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిన నేపధ్యంలో కేసు పూర్వాపరాలను వివరించి తాను ఏమి చేయదలచుకున్నది, అలాగే ఏమి చేస్తే బాగుంటుంది. రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నదానిపై చర్చలు జరపవచ్చు. సెప్టెంబర్ రెండో తేదీన జగన్ ఇడుపులపాయ వెళ్లి తండ్రి రాజశేఖరరెడ్డి వర్ధంతి లో పాల్గొని తిరిగి మరుసటి రోజుకు హైదరాబాద్ వస్తారు.

చిరుకి మ‌రో ప‌రీక్ష పెట్ట‌నున్న కాంగ్రెస్‌


కాంగ్రెస్ పార్టీలో చిరంజీవికి మరో పరీక్ష పెడతారా? అందుకు రంగం సిద్దం అవుతోందా? కాంగ్రెస్ వర్గాల భావన ప్రకారం జగన్ కు మద్దతుగా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసిన ఇరవైఆరు మంది స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే మొత్తం ప్రచార భారం అంతా మెగాస్టార్ చిరంజీవిపై పెట్టడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఆయనకు ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆయన సత్తా తేల్చడానికి ఇది ఒక అవకాశంగా కాంగ్రెస్ లోని ఒక వర్గం ప్రచారం మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఉప ఎన్నికలు వస్తే చిరంజీవి కీలకం అవుతారని ప్రచారం కూడా ఆరంభించారు. దానికి కారణం ఏమిటంటే ఈ ఇరవై ఆరు నియోజకవర్గాలలో పందొమ్మిది నియోజకవర్గాలలో ప్రజారాజ్యం పార్టీకి ఇరవైవేలు అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. సాధారణ లెక్కల ప్రకారం చూస్తే, గత ఎన్నికలలో కాంగ్రెస్ కు, ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఓట్లను లెక్క వేస్తే కాంగ్రెస్ పార్టీ ఆటోమాటిక్ గా గెలవాలి. రాజకీయాలలో ఒకటి ప్లస్ ఒకటి రెండు అవుతుందన్న గ్యారంటీ ఉండదు. పైగా జగన్ కు సానుభూతి ఉంటే దాని ప్రభావం అధికంగా సహజంగానే పడుతుంది. కడప ఉప ఎన్నికలలో కాంగ్రెస్, టిడిపిలకు డిపాజిట్ పోవడంతో ఆ పార్టీలు ఖంగు తిన్నాయి.ఇప్పుడు ఎవరు ఉప ఎన్నికలకు బాధ్యత వహించాలన్న చర్చ ఆరంభమవుతుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు సహజంగా బాధ్యత వహించాలి. ప్రభుత్వంపై ప్రజలలోఉన్న అభిప్రాయంగా దీనిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా ముగ్గులో దింపితే ఎన్నికల పలిత ప్రభావం డైల్యూట్ అవుతుందన్నది కొందరి ఆలోచనగా ఉంది. చిరంజీవి పార్టీకి గతంలో టెక్కలి, నరసన్నపేట, పాయకరావుపేట, అనపర్తి, కాకినాడ, రామచంద్రాపురం, నరసాపురం, ఏలూరు, పోలవరం, ప్రత్తిపాడు, దర్శి, ఒంగోలు, కోవూరు, రాజంపేట, కోడూరు పాణ్యం, అనంతపురం మొదలైన చోట్ల గణనీయంగా ఓట్లు వచ్చాయి .అదే సమయంలో టెక్కలి ఉప ఎన్నిక సమయంలో ప్రజారాజ్యం ఓట్ల గణనీయంగా తగ్గిపోయాయి. కోస్తా జిల్లాలలో ఒక సామాజిక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న చిరంజీవి ద్వారా ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడం ద్వారా విజయం సాధించాలన్నది కాంగ్రెస్ వ్యూహకర్తల ఆలోచనగా ఉంది. ఇందులో రెండు పాయింట్లు ఉన్నాయి. ఉప ఎన్నికలలో గెలిస్తే దానిని అందరూ పంచుకోవచ్చు. అన్ని లేదా ఎక్కువ చోట్ల ఓడిపోయినా దానిని చిరంజీవిపై నెట్టవచ్చు. ప్రజారాజ్యం పార్టీని, ప్రజాభిమానం కలిగినట్లు భావించిన చిరంజీవి వల్ల కూడా ఫలితం దక్కలేదని అధిష్టానానికి చెప్పవచ్చన్నది వారి వ్యూహంగా ఉంది.చిరంజీని ఈ భారాన్ని మోయడానికి సిద్దంగా ఉంటారా?

మేనేజ్‌మెంట్ నాయ‌కా.. వినాయ‌క‌


గణపతి విఘ్నాలకు అధిపతి. సిద్ధి బుద్ధి ప్రదాత. కార్య నిర్వహణలో తిరుగులేని విజయాన్ని ఇచ్చే వినాయకుడు  నాయకత్వ లక్షణాలకు ప్రతీక. గణపతి విచిత్ర రూపమే మానవ ప్రవర్తనకు దిక్సూచి. విజయానికి దారి చూపే గురి. గణపతి రూపంలో మానవ జాతికి దారి చూపే ప్రతీకాత్మక ‘నాయకత్వ’  విశేషాలేమిటో  తెలుసుకుందాం.


పెద్ద  తల: పెద్ద పెద్ద కలలు కనాలని సూచిస్తుంది.

చేటంత చెవులు: ‘వినదగునెవ్వరు  చెప్పిన’ ! ఎవరేమి చెప్పినా స్థిమితంగా  వినాలని సూచిస్తాయి.

చిన్న కళ్ళు: ఏకాగ్రతను సాధించాలని తెలుపుతాయి.

గొడ్డలి: ప్రగతికి ప్రతిబంధకమయ్యే  అనుబంధాలను ఖండించాలి అంటే దూరంగా ఉండాలి.

తాడు: అత్యున్నత  లక్ష్యం  వైపు  మిమ్మల్ని లాగుతుంది.

చిన్ని నోరు: మితంగా మాట్లాడాలి.

ఏక దంతం: మంచిని ఉంచుకుని చెడును విసర్జించాలి.

అభయ హస్తం: రక్షణకు చిహ్నం. నాయకుడైనవాడు తన బృందానికి రక్షణ కవచంలా ఉండాలి. ఆధ్యాత్మిక ప్రగతివైపు పయనించాలని సూచిస్తుంది. వ్యక్తిగత వికాసంనుండి వ్యక్తిత్వ వికాసంవైపు పయనించగలవాడే అభయమివ్వగలడని బోధిస్తుంది.

తొండం: అత్యున్నత సామర్ధ్యానికి, ఎటువంటి స్థితికైనా ఒదిగిపోయి, సర్దుకుపోయే తత్వానికి ప్రతీక.

పెద్ద పొట్ట: జీవితంలోని మంచి, చెడుని ‘స్థితప్రజ్ఞత’తో జీర్ణించుకోవాలని బోధిస్తుంది.

మోదకం (ఉండ్రాళ్ళు) : మన ప్రయత్నాలకు, సాధనకు లభించే బహుమతి.

ప్రసాదం: ప్రపంచమంతా నీ పాదాల చెంత ఉంటుంది. నీ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు –
నువ్వు నడుస్తూ నలుగురినీ నడిపించే రీతిలో ఉంటే విజయం నీ సొంతం.

మూషికం: మనిషిలో పెరిగిపోయే కోరికలకు గుర్తు. నియంత్రించకపోతే మన మీదే సవారీ చేస్తాయి. నువ్వే కోరికల మూషికాన్ని  నియంత్రించి సవారీ చేయాలని బోధిస్తుంది.

- చల్లా రామ ఫణి
9247431892

జ‌గ‌న్‌పై మ‌రో కొత్త కేసు.. ఈడీ కేసు


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు.. ఎమ్మార్ వ్యవహారంపై ఈడీ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఫెమా కింద జగన్, ఎమ్మార్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన కొందరు అధికారులు జగన్‌కు కొమ్ము కాస్తున్నారంటూ ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు మంగళవారంనాడు ప్రధానికి ఫిర్యాదు చేశారు. దాంతో ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగింది. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తునకు సంబంధించి ఒక నివేదికను 48 గంటలలో ఇవ్వాలని ప్రధాని కార్యాలయం ఇ.డి.ని ఆదేశించింది. జగన్ కంపెనీలలోకి ధన ప్రవాహం ఎలా జరిగింది, నిధులు ఎక్కడెక్కడినుంచి ఏయే రూపాలలో దారి మళ్లాయన్న అంశాలపై దర్యాప్తు ఇంకా లోతుగా జరగబోతున్నది. ఫెమా సెక్షన్ల క్రింద కూడా ఇ.డి. కేసులు నమోదు చే సింది. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు చాలా వరకు బోగస్ అని సి.బి.ఐ. ఇప్పటికే తేల్చింది.  ఈడీ తన ఎఫ్ఐఆర్ లో జగన్ ను తొలి ముద్దాయిగా పేర్కొంది. సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న 74 మందిని.. తమ ఎఫ్ఐఆర్ లోనూ.. చేర్చింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. ఓ వైపు సీబీఐ తదుపరి విచారణ జరుగుతున్న సమయంలో.. ఈడీ జగన్ పై కేసు నమోదు చేసింది. కాగా ఎమ్మార్ వ్యవహారంలో బీపీ ఆచార్య మొదటి ముద్దాయిగా.. ఆరుగురిని ఎఫ్ఐఆర్ లో చేర్చింది. విదేశాలకు నిధుల తరలింపు, రవాణాపై ఎన్ ఫోర్స్ మెంట్ దర్యాప్తు చేయనుంది.

పార్టీని కూడా వ‌దులుతారా..?


అవసరమైతే పార్టీని వదలిపెట్టి కొత్త వేదికను ఏర్పాటు చేసుకుని తెలంగాణ ఉద్యమం చేపడతామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి చెప్పారని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు. జానారెడ్డితో తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు దయాకరరావు, మోత్కుపల్లి నరసింహలు, చందర్ రావు తదితరులు బేటీ అయ్యారు. తాము రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయని, అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుందని, తద్వారా తెలంగాణ ఏర్పాటు సాధ్యమవుతుందని దయాకరరావు బృందం జానారెడ్డితో వ్యాఖ్యానించింది. దానిపై జానారెడ్డి స్పందిస్తూ, తాను ఒక వ్యూహం ప్రకారం కార్యక్రమం రూపొందిస్తున్నానని, అవసరమైతే పార్టీని వదలి తెలంగాణ ఉద్యమం చేపట్టడానికి కూడా సిద్దమేనని, దానికి టిడిపి నేతలు కూడా సిద్దమా అని జానారెడ్డి ప్రశ్నించారని, అందుకు తాము కూడా సిద్దమేనని స్పష్టం చేశామని దయాకరరావు తెలిపారు.అయితే జానారెడ్డి బాద్యతలు నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, జానారెడ్డి పార్టీని వదలి వస్తానంటున్నప్పుడు ఇక మంత్రి పదవి గురించి , బాధ్యతల గురించి ఎందుకు ప్రశ్నిస్తామని అన్నారు. కాగా మరో నేత మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ ఎమ్మెల్యేలను అవమానించే రీతిలో వ్యవహరిస్తున్నారని, అవసరమైతే ఆయనపై కేసులు పెడతామని, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చి సభకు రప్పించేలా చేస్తామని హెచ్చరించారు.

దూకుడు పార్ట‌న‌ర్ గా ర‌మేష్‌బాబు


ప్రిన్స్ మ‌హేష్‌బాబు హీరోగా శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న చిత్రం దూకుడు. ఈ చిత్రం ఆడియో ఇటీవ‌లే విడుద‌ల‌పై సినిమాపై భారీ అంచ‌నాల‌ని పెంచింది. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోన‌ప్ప‌టికీ, విడుద‌ల స‌మ‌యంలో ఈ చిత్రంలో పార్ట‌న‌ర్‌గా మ‌హేష్‌బాబు అన్న‌య్య ర‌మేష్‌బాబు చేరుతున్న‌ట్టు స‌మాచారం. త‌మ్ముడు మ‌హేష్‌బాబుతో భారీ బ‌డ్జెట్‌తో అత‌థి, అర్జున్ చిత్రాలు నిర్మించి చేతులు కాల్చుకోవ‌డం తెలిసిందే.. అయితే దూకుడు స‌క్సెస్‌పై మ‌హేష్‌బాబు విశ్వాసంగా ఉండ‌టంతో ఈ చిత్రం స‌క్సెస్ సాధించి కాసుల వ‌ర్షం కురిపిస్తుంద‌ని ఊహించి న‌ష్టాల్లో ఉన్న త‌న బ్ర‌ద‌ర్ ర‌మేష్‌ని ఈ చిత్రంలో పార్ట‌న‌ర్‌గా చేర్చేందుకు ప్ర‌య‌త్న‌స్తున్న‌ట్టు వినికిడి. గ‌తంలో పూరి జ‌గ‌న్నాథ్ నిర్మించి సెన్సేష‌న‌ల్ మూవీ పోకిర‌లో కూడా త‌న సోద‌రి మంజుల పార్ట‌న‌ర్‌గా చేరి లాభాల‌ను కూడ‌గ‌ట్టుకోవ‌డం తెలిసిందే.. సో.. ఇప్పుడు ర‌మేష్‌ని కూడా లాభాల్లోకి తీసుకురావ‌డానికి మ‌హేష్ న‌డుంబింగించాడ‌ని తెలుస్తోంది.

జైబోలో తెలంగాణ‌కి ద‌క్కిన గౌర‌వం..


ప్ర‌తిష్టాత్మ‌క సౌత్ ఏసియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో తెలంగాణ క‌థాంశంతో తీసిన జై భోలో తెలంగాణ చిత్రం ప్ర‌ద‌ర్శ‌న‌కి ఎంపిక‌య్యింది. సౌత్ ఆసియాలోని 8 దేశ‌ల‌లో నిర్మించిన 50 చిత్రాల‌ని ఎంపిక చేసి ఈ ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శిస్తారు. ఎన్నో చిత్రాల‌ని ప‌రిశీలించిన త‌ర్వాత అత్యుత్త‌మంగా అనిపించే యాభై చిత్రాల‌కి ఈ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శించ‌డానికి అర్హ‌త ల‌భిస్తుంది.. ఆ యాభై చిత్రాల‌లో జై భోలో తెలంగాణ చిత్రం ఒక‌టి కావ‌డం విశేషం. ప్ర‌త్యేక తెలంగాణ కోసం అర‌వై ఏళ్ళుగా సాగుతున్న ఉద్య‌మం నేప‌థ్యంలో సాగిన ఈ చిత్రంలో తెలంగాణ‌ అమ‌ర వీరులని స్పృషిస్తూ, ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థిత‌ల‌కి అనుగుణంగా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు మ‌లిచారు. ఈ చిత్రంలో తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి విజ‌యాన్ని సాధించడ‌మే కాకుండా క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా స‌క్సెస్ అయ్యింది. ఈ చిత్రం ఎస్ ఏ ఎఫ్ ఎఫ్ ఫెస్టివ‌ల్‌కి ఎంపిక కావ‌డం ప‌ట్ల ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ఎన్‌. శంక‌ర్ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసారు. ఇది తెలంగాణ ప్ర‌జ‌ల విజ‌య‌మే కాకుండా తెలుగు వారంద‌రి విజ‌యంగా ఆయ‌న చెప్పారు. సౌత్ ఏషియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ సినిమా ఎంపిక కావ‌డం అన్న‌ది మామూలు విష‌యం కాద‌ని, ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం, చెల‌రేగుతున్న అల్ల‌ర్లు, ప్ర‌జ‌ల భావోద్వేగాలని మాన‌వీయ కోణంలో హృద‌యానికి హ‌త్తుకునే విధంగా తాను తీయ‌గ‌లిగాన‌ని అందుకే ఈ చిత్రానికి ఈ గౌర‌వం ద‌క్కింద‌ని అన్నారు. ఏది ఏమ‌యిన‌ప్ప‌టికీ ఒక తెలుగు సినిమాకి ఇంత మంచి గౌర‌వం ద‌క్క‌డం ఎంతైనా అభినంద‌నీయం.

29, ఆగస్టు 2011, సోమవారం

గ‌ణేష్ నిమ‌జ్జ‌నం త‌ర్వాతే ఆడియో..


ఎన్టీఆర్‌, సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌ కంగా రూపొందుతున్న చిత్రం ఊస‌ర‌వెళ్ళి. కిక్ విజ‌యం ఇచ్చిన కిక్‌తో ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి ఊపుమీద ఉండ‌గా, శ‌క్తి ఇచ్చిన ఘోర‌ప‌రాజ‌యం షాక్‌లో ఎన్టీఆర్ ఉన్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న‌ల్ వ‌స్తున్న ఊస‌ర‌వెళ్ళిపై స‌హ‌జంగానే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. పైగా ఊస‌ర‌వెళ్ళి అన‌గానే నెగెటివ్ ఫీలింగ్ క‌లిగించే టైటిల్ ఇది.. మ‌రి ఈ టైటిల్‌ని బ‌ట్టే సినిమాలో ఎన్టీఆర్‌ని ఎన్ని రంగులు మారుస్తూ (షేడ్స్‌) చూపిస్తాడో చూడాల్సింది. పైగా ఈ చిత్రం క‌థ కూడా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని, గ‌జిని సినిమాలాంటి పాయింట్‌నే ఈ సినిమాలో తీసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమ‌యిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్‌కి ఈ చిత్రం ఘ‌న‌విజ‌యం ప్ర‌స్తుతం ఎంతో అవ‌స‌రం. ఈ చిత్రం ఆడియోని సెప్టెంబ‌ర్ 11న రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారు. అయితే ఆ రోజు గ‌ణేష్ నిమ‌జ్జ‌నోత్స‌వం ఉండ‌డంతో ఆడియో రిలీజ్‌ని 12వ తేదీకి పోస్ట్‌పోన్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ‌ప్ర‌సాద్ అందించ‌గా భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.