జ‌గ‌న్‌పై మ‌రో కొత్త కేసు.. ఈడీ కేసు


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు.. ఎమ్మార్ వ్యవహారంపై ఈడీ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఫెమా కింద జగన్, ఎమ్మార్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన కొందరు అధికారులు జగన్‌కు కొమ్ము కాస్తున్నారంటూ ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు మంగళవారంనాడు ప్రధానికి ఫిర్యాదు చేశారు. దాంతో ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగింది. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తునకు సంబంధించి ఒక నివేదికను 48 గంటలలో ఇవ్వాలని ప్రధాని కార్యాలయం ఇ.డి.ని ఆదేశించింది. జగన్ కంపెనీలలోకి ధన ప్రవాహం ఎలా జరిగింది, నిధులు ఎక్కడెక్కడినుంచి ఏయే రూపాలలో దారి మళ్లాయన్న అంశాలపై దర్యాప్తు ఇంకా లోతుగా జరగబోతున్నది. ఫెమా సెక్షన్ల క్రింద కూడా ఇ.డి. కేసులు నమోదు చే సింది. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు చాలా వరకు బోగస్ అని సి.బి.ఐ. ఇప్పటికే తేల్చింది.  ఈడీ తన ఎఫ్ఐఆర్ లో జగన్ ను తొలి ముద్దాయిగా పేర్కొంది. సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న 74 మందిని.. తమ ఎఫ్ఐఆర్ లోనూ.. చేర్చింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. ఓ వైపు సీబీఐ తదుపరి విచారణ జరుగుతున్న సమయంలో.. ఈడీ జగన్ పై కేసు నమోదు చేసింది. కాగా ఎమ్మార్ వ్యవహారంలో బీపీ ఆచార్య మొదటి ముద్దాయిగా.. ఆరుగురిని ఎఫ్ఐఆర్ లో చేర్చింది. విదేశాలకు నిధుల తరలింపు, రవాణాపై ఎన్ ఫోర్స్ మెంట్ దర్యాప్తు చేయనుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!