సినీనటి నగ్న ప్రచారం



మరాఠీ సినీనటి యోగితా దండేకర్ అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. టాప్ లెస్ గా ఉంటూ ఇదిగో ఇలా ఫోజిలిచ్చేసింది. నడుంపై భాగమంతా ట్రైకలర్స్ తో నింపేసుకుందీ ముద్దుగుమ్మ. రోజూ వేలాది మంది అన్నా హజారే మద్దతుదారులు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో తమకుతోచిన రీతిలో సపోర్ట్ చేస్తుంటే, ఈ సినీతార మాత్రం ఇలా  టాప్ లెస్ గా ఉంటూనే అశ్లీలానికి చోటులేని విధంగా మువ్వన్నెల రంగులతో బాడీని నింపేసుకుంది. వెనుక వీపుమీద మాత్రం అన్నా హజారే బొమ్మ వేయించుకుంది.


ఇంతకు ముందే పూనం పాండే కూడా హజారే ఉద్యమం విషయంలోనే నగ్నంగా ఉంటానంటూ ప్రకటన చేసింది. అయితే, యోగిత మాత్రం మరీ నూడ్ గా కాకుండా ఇలా పెయింట్స్ తో ఒళ్లు కప్పేసుకుంది. కింద మాత్రం జీన్ ప్యాంట్ ను అలాగే ఉంచేసుకుంది. నెత్తిమీద గాంధీ టోపీ పెట్టుకుందీ చిన్నది. గత పదేళ్లుగా తాను అన్నా హజారేను సపోర్ట్ చేస్తున్నానని అంటోంది ఈ సుందరి. యోగిత మరాఠీ భాషలో కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించింది. పార్లమెంట్ జన్ లోక్ పాల్ బిల్లును ఆమోదిస్తే, తాను నగ్నంగా డాన్స్ చేస్తానని కూడా అంటోంది యోగిత.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!