కోమ‌టిరెడ్డి మ‌న‌సులో ఏముంది..?


తెలంగాణపై మిగిలిన మంత్రుల సంగతి ఎలా ఉన్నా నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తీవ్రంగా మాట్లాడుతున్నారు.తెలంగాణకు తాను కట్టుబడి ఉన్నానని, సెప్టెంబరు వరకు వేచి చూస్తానని , ఆ తర్వాత ప్రజలతో కలిసి ఉద్యమిస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు. లక్ష మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని కోమటిరెడ్డి హెచ్చరించారు. తెలంగాణ మంత్రులు ఏమి సాధించారని విధులకు వెళతారని,క్యాబినెట్ సమావేశాలకు వెళతారని కోమటిరెడ్డి ఎద్దేవ చేశారు.తెలంగాణపై స్పష్టత వచ్చే వరకు రాజీ పడే ప్రసక్తి లేదని, తాను మంత్రి పదవి విధులను నిర్వహించబోనని ఆయన స్పష్టం చేశారు.మొత్తమ మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెల్లగా కాంగ్రెస్ కు దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఒకపక్క తెలంగాణ కు చెందిన దాదాపు మంత్రులంతా నిశ్శబ్దంగా తమ బాద్యతలు తాము చేపడుతుంటే, కోమటిరెడ్డి మాత్రం అధిష్టానాన్ని ధిక్కరించే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో కొందరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయవచ్చని కూడా అంటున్నారు.తెలంగాణ, తర్వాత జగన్ అంశాల ప్రభావం ఈయనపై ఉంటుందని చెబుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జగన్ జైలుకెళ్తే…

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!