అవ‌రోధాలెన్నొచ్చినా..


ఒక్కసారి మొదలు పెట్టిన ఉద్యమాన్ని మధ్యలో వదిలిపెట్టేది లేదని.. పౌరసమాజం ప్రతినిధి.. అన్నా హజారే స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై అన్నా మీడియాతో మాట్లాడారు. కొందరు కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. హజారే స్పష్టం చేశారు. ఇవన్నీ కుట్రపూరితమైనవని అన్నా చెప్పారు. కేంద్రం నచ్చిన అధికారితో లేదా నచ్చిన సంస్థతో తనపై దర్యాప్తు చేసుకోవచ్చని అన్నా తేల్చేశారు. ఆరోపణలు నిజమైతే.. ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. గతంలో మహారాష్ట్ర సర్కార్ కూడా తనపై సీఐడీ విచారణ జరిపించి.. ఏం తేల్చలేకపోయిందని ఆయన అన్నారు. ఏదేమైనా ఆగస్టు 16 నుంచి దీక్షను మొదలు పెడతానని అన్నా హజారే స్పష్టం చేశారు. ఆందోళనలు అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతాయని అన్నారు. లోక్ పాల్ తో పాటు.. లోకాయుక్త ఏర్పాటుకూ డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లాఠీచార్జీలు, కాల్పులు జరిగినా వెనక్కివెళ్లేది లేదన్నారు. మొదలు పెట్టిన ఉద్యమాన్ని మధ్యలో ఆపేది లేదన్నారు. ఉద్యమం ఎంత ఉదృతంగా సాగిన.. శాంతిభద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఉద్యమం మూలంగా ఏ ఒక్కరికీ నష్టం కలగవద్దని అభిప్రాయపడ్డారు. మరోవైపు అన్నా హజారేకు డబ్బు ఎక్కడినుంచి వస్తుందో ఆ వివరాలన్నీ.. వెబ్ సైట్లో పొందుపరుస్తున్నామని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!