కాంగ్రెస్ లో సోనియా మాటకే విలువ లేదా ?


సోనియా హామీ ఇచ్చినా  పదవులు రావడం  లేదంటే ఆమె మాటకు విలువ ఉన్నట్టా! లేనట్టా? అని గుంటూరు  ఎంపీ  రాయపాటి వారికీ సందేహమొచ్చింది.నేరుగా ఆమాట అనక పోయినా అదే అర్ధం తో  సి ఏం కిరణ్ కి తగిలేలా రాయపాటి ప్రశ్నలు సంధిస్తున్నారు.అసలు విషయం ఏమిటంటే  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి ఇస్తానని సాక్షాత్తూ సోనియాగాంధీ తనకు హామీ ఇచ్చారని, కానీ, అది నెరవేరలేదని  రాయపాటి సాంబశివరావు  ఆవేదన!  దేవుడికి సేవ చేసుకుంటా అని విన్నవించుకున్న అవకాశం ఇవ్వలేదని  రాయపాటి వాపోతున్నారు. . రాష్ట్ర ఎంపీల్లో కావూరి సాంబశివరావు, తానూ సీనియర్లమని, ఇద్దరికీ కేబినెట్ మంత్రి పదవి విషయంలో పోటీ నెలకొన్న నేపథ్యంలో గతంలో తాను సోనియాగాంధీని కలిశానని, కావూరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని, తాను రాష్ట్రంలో దేవుడికి సేవ చేసుకుంటానని చెప్పానని వెల్లడించారు.
ఆ మేరకు సోనియా హామీ ఇచ్చారట.  ఆ  విషయాన్ని అహ్మద్ పటేల్ మూడుసార్లు సీఎం కిరణ్‌కు చెప్పారట. . తాను కిరణ్‌ను కలిసినప్పుడు మేడమ్ తిరిగి వచ్చాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారని, ఆమె రాకముందే నిర్ణయం తీసేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకలా చేశారో తనకు తెలియదని, ఏమైనా ఒత్తిళ్లు పని చేసి ఉండొచ్చని చెప్పా రు. వేంకటేశ్వరునికి సేవ చేసుకుందామని భావించానని, చైర్మన్ పదవి రాకపోవటం తన దురదృష్టమని బాధపడ్డారు.
‘నాకు రానందుకే బాధ పడుతున్నాను తప్పితే కనుమూరి బాపిరాజుకు వచ్చినందుకు కాదు’ అని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌లో విశ్వాసంగా, నమ్మిన బంట్లుగా ఉ న్నవారిని బందుల దొడ్లో కట్టిపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన వారిని మహరాజుల్లా చూసుకుంటూ, పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు.  ఇక కార్యకర్తల మాట విని వేరే పార్టీ లోకి వెళ్ళడం మేలనే నిర్ణయానికి రాయపాటి వచ్చారు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!