వీరెందుకు రాజీనామా చేయ‌లేదు..?


జగన్ వర్గానికి చెందిన ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయలేదన్నదానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుద, భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి లు తాము గతంలోనే రాజీనామా చేశామని, వాటిని ఆమోదించాలని కోరుతున్నామని చెప్పి ఊరుకున్నారు.కాని వాటిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ గత నెలలోనే తిరస్కరించారు. వీరిలో కొండా సురేఖ పై అనర్హత పిటిషన్ కూడా పెండింగులో ఉంది. అది వేరే విషయం. మామూలుగా అయితే జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఇరవై ఆరుమంది రాజీనామాలు చేయగా వీరు మాత్రం చేయకుండా గతంలోనే రాజీనామా చేశామని ప్రకటించడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. కాగా దీనిపై కొందరు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నదేమిటంటే వీరు ముగ్గురు నిజంగానే మళ్లీ ఎన్నికలలో పోటీచేస్తే గెలుపు కష్టం అవుతందని అంటున్నారు. జగన్ కోసం రాజీనామా చేశామంటే తెలంగాణలో దానికి అంత స్పందన రాకపోవచ్చన్నది ఒక పాయింట్ అయితే, తెలంగాణ అంశంపై రాజీనామా చేశామని చెప్పినా వ్యక్తిగతంగా గెలవడం కష్టమని అందువల్లనే వారు ఆ ప్రకటన చేసి ఊరుకున్నారన్నది ఒక అంచనా. ముగ్గురు ఓడిపోయే అవకాశం ఉందని, కచ్చితంగా ఇద్దరు మాత్రం ఓడిపోతారని, వారిపై జనంలో వ్యతిరేకత ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆ పాయింటు చెప్పకుండా జగన్ వర్గం తెలివిగా రాజకీయ నడుపుతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!