జైబోలో తెలంగాణ‌కి ద‌క్కిన గౌర‌వం..


ప్ర‌తిష్టాత్మ‌క సౌత్ ఏసియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో తెలంగాణ క‌థాంశంతో తీసిన జై భోలో తెలంగాణ చిత్రం ప్ర‌ద‌ర్శ‌న‌కి ఎంపిక‌య్యింది. సౌత్ ఆసియాలోని 8 దేశ‌ల‌లో నిర్మించిన 50 చిత్రాల‌ని ఎంపిక చేసి ఈ ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శిస్తారు. ఎన్నో చిత్రాల‌ని ప‌రిశీలించిన త‌ర్వాత అత్యుత్త‌మంగా అనిపించే యాభై చిత్రాల‌కి ఈ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శించ‌డానికి అర్హ‌త ల‌భిస్తుంది.. ఆ యాభై చిత్రాల‌లో జై భోలో తెలంగాణ చిత్రం ఒక‌టి కావ‌డం విశేషం. ప్ర‌త్యేక తెలంగాణ కోసం అర‌వై ఏళ్ళుగా సాగుతున్న ఉద్య‌మం నేప‌థ్యంలో సాగిన ఈ చిత్రంలో తెలంగాణ‌ అమ‌ర వీరులని స్పృషిస్తూ, ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థిత‌ల‌కి అనుగుణంగా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు మ‌లిచారు. ఈ చిత్రంలో తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి విజ‌యాన్ని సాధించడ‌మే కాకుండా క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా స‌క్సెస్ అయ్యింది. ఈ చిత్రం ఎస్ ఏ ఎఫ్ ఎఫ్ ఫెస్టివ‌ల్‌కి ఎంపిక కావ‌డం ప‌ట్ల ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ఎన్‌. శంక‌ర్ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసారు. ఇది తెలంగాణ ప్ర‌జ‌ల విజ‌య‌మే కాకుండా తెలుగు వారంద‌రి విజ‌యంగా ఆయ‌న చెప్పారు. సౌత్ ఏషియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ సినిమా ఎంపిక కావ‌డం అన్న‌ది మామూలు విష‌యం కాద‌ని, ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం, చెల‌రేగుతున్న అల్ల‌ర్లు, ప్ర‌జ‌ల భావోద్వేగాలని మాన‌వీయ కోణంలో హృద‌యానికి హ‌త్తుకునే విధంగా తాను తీయ‌గ‌లిగాన‌ని అందుకే ఈ చిత్రానికి ఈ గౌర‌వం ద‌క్కింద‌ని అన్నారు. ఏది ఏమ‌యిన‌ప్ప‌టికీ ఒక తెలుగు సినిమాకి ఇంత మంచి గౌర‌వం ద‌క్క‌డం ఎంతైనా అభినంద‌నీయం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!