ద‌డ (మూవీ రివ్యూ)


బ్యానర్ : శ్రీ కామాక్షి ఎంతెర్ప్రిసేస్
తారాగ‌ణం : నాగ‌చైత‌న్య‌, కాజ‌ల్‌, బ్ర‌హ్మానందం, కిల్లీదోర్జి, ధ‌ర్మ‌వ‌ర‌పు, వేణుమాధ‌వ్ త‌దిత‌రులు…
విడుదలయిన తేది : Aug 11, 2011
రాజీవ్ (శ్రీ‌రామ్‌), విశ్వ (నాగ చైత‌న్య‌) ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ములు, అనాథ‌లు. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళై అమెరికాలో సెటిలవుతారు. అన్నయ్యకి పెళ్ళవుతుంది. విశ్వ కోటీశ్వరుడి కూతురు రియా( కాజల్ అగర్వాల్)ని ప్రేమిస్తాడు. ఒక రోజు మాఫియా డాన్ ఆర్.డి. 100 మంది అమ్మాయిల‌ని అమ్మ‌డానికి సిద్ద‌ప‌డే క్ర‌మంలో ఆ వందమంది అమ్మాయిలను తనకు తెలియకుండానే విడిపిస్తాడు విశ్వ…అందువల్ల ఆర్.డీ.కి వంద కోట్ల నష్టం వస్తుంది. దాంతో విశ్వని చంపటం కోసం ఆర్.డి. ముఠా గాలిస్తుంది. మ‌రో వైపు విశ్వ అన్న కూడా ఆర్.డి. దగ్గరే పనిచేస్తుంటాడు…చివ‌రికి విశ్వ మాఫియా నుంచి ఎలా త‌ప్పించుకున్నాడు..? రియా ప్రేమ‌ని పొందుతాడా…? అన్న‌ది మిగ‌గా క‌థ‌.
ఎనాలసిస్ :
ఈ సినిమా క‌థ‌, క‌థ‌నం రెండూ చాలా వీక్‌గా ఉన్నాయి. క‌థ‌నాన్ని కూర్చ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ కాలేదు.  ఒక విధంగా చూస్తే దర్శకుడు ఏ సీన్ కి ఆ సీన్ బాగా తీశాడు. కానీ అన్ని సీన్లకూ సమన్వయం కుదరక పోవటం ఈ సినిమాకి మైనస్ పాయింట్. అలాగే బ్రహ్మానందం, ఆలీ, వేణు మాధవ్, యమ్.యస్. నారాయణల కామెడీ అంతగా పండలేదని చెప్పాలి. క‌థ‌, క‌థ‌నం వీక్‌గా ఉన్న‌ప్ప‌టికీ సినిమా నిర్మాణ‌ విలువలు చాలా బాగున్నాయి. ఆ రిచ్ నెస్ ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.
నటన – ఈ సినిమాలో నాగచైతన్య నటనలో ఇంకొంచెం మెచ్యూరిటీ వచ్చింది. తొలి మూడు సినిమాల కన్నా ఈ సినిమాలోని డ్యాన్సుల్లో కాస్త వళ్ళు కదిపాడు…ఫైట్స్ కూడా బాగానే చేశాడు. ఈ సినిమా వరకూ అతని కృషి లోపం లేదు. ఇక కాజల్ తన స్థాయిలో తను బాగానే నటించింది. విలన్లుగా రాహుల్ దేవ్, కెల్లీ డార్జిల నటనలో కొత్తదనం ఆశించటం దురాశే అవుతుంది.
సంగీతం బావుంది.. ఫైట్స్‌, డాన్స్‌లు ఆక‌ట్టుకుంటాయి.
మొద‌టిసారి నాగ‌చైత‌న్య మాస్ హీరోగా పేరుతెచ్చుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుంద‌న్న‌ది ఈ సినిమా విజ‌యం పై ఆధార‌ప‌డి ఉన్న‌ది.

ఎస్‌.కె.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!