సెప్టెంబ‌ర్ 17 క‌ల్లా ఇవ్వాల్సిందే..!


స్వాతంత్ర్యం వచ్చి 60 యేళ్లు దాటినా.. తెలంగాణ ప్రజలకు ఇంకా స్వేచ్ఛ రాలేదని తెలుగుదేశం బహిష్కృత నేత, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర నాగం మాట్లాడుతూ.. ఇప్పటికీ తెలంగాణలో 1947 నాటి పరిస్థితులే ఉన్నాయని.. చెప్పుకొచ్చారు. ఇకనైనా సెప్టెంబర్ 17 కల్లా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని నాగం డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో ప్రజలు.. రైతులు సమస్యలతో సతమతమవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదని నాగం అన్నారు. అదే కోస్తా రైతులు క్రాప్ హలిడే ప్రకటించడంతో.. ఏకంగా కమిటీలను నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోస్తా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన కమిటీ తెలంగాణలోనూ పర్యటించాలని నాగం డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే ఆదేశాలివ్వాలని.. సీఎంను కోరుతున్నానని నాగం చెప్పుకొచ్చారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!