అప్రూవర్ గా మారాలి..


సుప్రింకోర్టులో జగన్ పిటిషన్ తోసిపుచ్చడంతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో కొత్త ఉత్సాహం కనబడుతోంది. ఇకనైనా జగన్ సిబిఐ విచారణకు పూర్తిగా సహకరించాలని ఈ పార్టీల నేతలు సూచిస్తున్నారు. జగన్ న్యాయస్థానాలను కూడా మభ్యపెట్టాలని చేసిన ప్రయత్నం విఫలం అయిందని టిడిపి నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక జగన్ అప్రూవర్ గా మారితే మంచిదని, అప్పుడు శిక్ష తక్కువగా పడే అవకాశం ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా మరో నేత పి.కేశవ్ మాట్లాడుతూ జగన్ కు అన్ని దారులు మూసివేసినట్లేనని, ఇకనైనా జగన్ దర్యాప్తులకు సహకరించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి మాట్లాడుతూ తీర్పును స్వాగతిస్తున్నానన్నారు. కాంగ్రెస్ కు దీనికి సంబందం లేదని తేలిందని ఆయన అన్నారు.
కాగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు, జగన్ కంపెనీలలో పెట్టుబడులకు రెంటికి జగన్ నే బాధ్యుడిని చేసే విధంగా సిబిఐ దర్యాప్తు జరుగుతోందని,దీనిపై తమకు అనుమానాలు వస్తున్నాయని అన్నారు. కాగా టిడిపి నాయకుడు ఎర్రన్నాయుడు మాట్లాడుతూ తాను ఊహించిన విధంగానే జరిగిందని అన్నారు. కధ,స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని రాజశేఖరరెడ్డి ఆద్వర్యంలోనే జరిగాయని , కనుక ఎఫ్ ఐ ఆర్ లో ఆయన పేరు ఉండడంలో ఆశ్చర్యం లేదని అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!