భ‌ద్రతా వ‌ల‌యంలో భార‌త్‌..


భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా దేశంలోని ప్రముఖ నగరాల్లో భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసారు. ఉద్రవాదుల నుంచి ముప్పు ఉన్నందున ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్నిచోట్ల భద్రతను కట్టుదిట్టం చేసారు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధాన కూడళ్ళలో నిఘా వర్గాలను నియమించారు. ఢిల్లీ పోలీసులే కాక, ప్రత్యేక పారామిలటరీ ఫోర్స్ ను కూడా నియమించటం జరిగింది. ఇక స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగే ఎర్రకోట వద్ద దాదాపు 40 సిసి కెమెరాలను ఏర్పాటు చేయటమే కాకుండా…పరిసర ప్రాంతాలలో బలగాలను మొహరించారు.ఇక దేశంలోని ముఖ్య నగరాలైన హైదరాబాద్, ముంబై, చెన్నై, కలకత్తా వంటి ప్రముఖ పట్టణాలలో పోలీసు శాఖ వారు అప్రమత్తం అయ్యారు. సున్నిత మైన ప్రదేశాలలో పటిష్ట భద్రతను ఏర్పాటు చెయ్యాలని కేంద్ర హోమ శాఖ కోరింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జగన్ జైలుకెళ్తే…

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!