లండ‌న్‌లో నైతిక విలువ‌లు శూన్యం


ఇప్పుడు బ్రిటన్ లో పిల్లల పెంపకంపై ప్రభుత్వ దృష్టి పడింది. పిల్లలను సరిగా పెంచకపోవడం వల్లనే ఇటీవలి లండన్ హింసా కాండ చెలరేగిందని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామరూన్ అభిప్రాయపడుతున్నారు.ఒక వ్యక్తిని పోలీసులు అన్యాయంగా కాల్చి చంపారన్న వివాదం పెరిగి చివరికి లూటీలు, ఆస్తుల దహనాలకు దారితీసింది. అయితే ఆ ఘటన సాకుతో కొందరు హింసకు పాల్పడ్డారన్నది ప్రధాని అభిప్రాయం. పిల్లలను సరిగా పెంచి, చదువులు చెప్పి ఉంటే ఇలా దోపిడీలకు పాల్పడి ఉండేవారు కాదని ఆయన అన్నారు. ఆయా షాపులపై లూటి చేసినవారు పెద్ద,పెద్ద టీవీలు ఎత్తుకువెళ్లిన దృశ్యాలు పలుచోట్లు రికార్డు అయ్యాయి.పేదరికానికి,ఈ దోపిడీలకు సంబంధం లేదని ఈ సన్నివేశాలు తెలియచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి ప్రవర్తన ఉండేలా నేర్పవలసిన అవసరం ఉందని ఈ ఘటనలు తెలియచెప్పాయని ఆయన అన్నారు.ఈ దోపిడీ, హింసాకాండలో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.అయితే యూరప్ సమాజంలో ఇప్పుడు పిల్లలు, తల్లిదండ్రుల సంబంధ బాంధవ్యాలపై చర్చకు ఈ ఘటనలు తెరలేపాయి.చిన్న,చిన్న విషయాలకు విడాకులు తీసుకోవడం,పిల్లలను గాలికి వదలివేయడం వంటి అనేక ఘటనలు జరుగుతున్న నేపద్యంలో ఒక బాధ్యత అనేది కొరవడి ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఇస్తోందని ప్రభుత్వం బావిస్తోంది.నైతిక విలువల విషయంలో కూడా శ్రద్వ వహించాలని ఇప్పుడు బ్రిటన్ సమాజం భావిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!