అన్నా హ‌జారే దీక్ష నిజ‌మేనా..?


అవినీతికి వ్యతిరేకంగా అన్నా హ‌జారే చేప‌ట్టిన దీక్ష నిజ‌మై న‌దేనా..? అన్న అనుమానం అవినీతి వ్యతిరేక‌త‌ని వ్యతిరేకించే కొంద‌రికి వ‌స్తుంది. 12 రోజుల పాటు ఆహారాన్ని తీసుకోకుండా అన్నా హ‌జారే ఆరోగ్యం చెక్కుచెద‌ ర‌కుండా ఉండ‌డం, ఆయ‌న‌లో ఉత్సాహం ఏమాత్రం త‌గ్గకుండా ఉండ‌డంతో వారు ఈ అనుమానాన్ని రేకెత్తిస్తు న్నారు. మ‌న ఏపిలో ఇలాంటి దీక్షలు కొత్తేమి కాదు.. కాక‌పోతే ఇవి రాజ‌కీయ నాయ‌కులు నాట‌కీయంగా చేసే దీక్షలు.. టిఆర్ ఎస్ అధినేత కె. చంద్రశేఖ‌ర‌రావు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, యోగా గురు బాబా రాందేవ్‌లు కూడా నిరాహార దీక్షచేసారు. కాక‌పోతే వారు కేవ‌లం నాలుగైదు రోజుల్లోని పూర్తిగా డీలా ప‌డిపోయారు. వారి ఒంట్లో ఉత్సాహం స‌న్నగిల్లిపోయింది. అలాంటిది 72 సంవ‌త్సరాల వ‌య‌సు క‌లిగిన అన్నా హ‌జారే లో ఎందుకు ఉత్సాహం త‌గ్గలేదు.. అన్నా ని దీక్షపై అనుమానంగా చూస్తున్నవారి వాద‌న ఎలా ఉన్నా.. ప్రపంచం యావ‌త్తూ త‌న‌వైపు చూస్తుండ‌గా అన్నాహ‌జారే దీక్ష చేప‌ట్టారు. అలాంటి దీక్షని అనుమానాస్పదంగా చూడ‌డం త‌గ‌దు. అన్నాహ‌జారే త‌న శ‌రీరాన్ని యోగబ‌లంతో పూర్తిగా త‌న ఆధీనంలో ఉంచుకున్నాడు. అందుకే ఆయ‌న రెండు వారాల‌పాటు ఆహారం లేక‌పోయినా చెక్కు చెద‌ర‌కుండా ఉన్నారు. ఆయ‌న రోజుకు కేవ‌లం రెండు రొట్టెలు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. ఇలా మితంగా ఆహారం తీసుకోవ‌డం కూడా అన్నా హ‌జారే ఆరోగ్యం పాడ‌వ‌ కుండా ఉండేలా చేసింద‌ని చెప్పాలి. ఉద‌యం నాలుగున్నర‌కే నిద్రలేవ‌డం, యోగాస‌నాలు, వ్యాయామం క్రమం త‌ప్పకుండా చేయ‌డం లాంటివి కూడా అన్నా హ‌జారేని దీక్ష చేప‌ట్టినా ఆరోగ్యం క్షీణించ‌కుండా కాపాడాయ‌ని చెప్పాలి. అవినీతికి వ్యతిరేకంగా అన్నా చేప‌ట్టిన ఈ దీక్ష నిజ‌మేనా..? అని అనుమానించే వారి అమాయ‌క‌త్వాన్ని చూసి జాలిప‌డ‌కుండా ఎలా ఉండ‌గ‌లం..?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!