మేనేజ్‌మెంట్ నాయ‌కా.. వినాయ‌క‌


గణపతి విఘ్నాలకు అధిపతి. సిద్ధి బుద్ధి ప్రదాత. కార్య నిర్వహణలో తిరుగులేని విజయాన్ని ఇచ్చే వినాయకుడు  నాయకత్వ లక్షణాలకు ప్రతీక. గణపతి విచిత్ర రూపమే మానవ ప్రవర్తనకు దిక్సూచి. విజయానికి దారి చూపే గురి. గణపతి రూపంలో మానవ జాతికి దారి చూపే ప్రతీకాత్మక ‘నాయకత్వ’  విశేషాలేమిటో  తెలుసుకుందాం.


పెద్ద  తల: పెద్ద పెద్ద కలలు కనాలని సూచిస్తుంది.

చేటంత చెవులు: ‘వినదగునెవ్వరు  చెప్పిన’ ! ఎవరేమి చెప్పినా స్థిమితంగా  వినాలని సూచిస్తాయి.

చిన్న కళ్ళు: ఏకాగ్రతను సాధించాలని తెలుపుతాయి.

గొడ్డలి: ప్రగతికి ప్రతిబంధకమయ్యే  అనుబంధాలను ఖండించాలి అంటే దూరంగా ఉండాలి.

తాడు: అత్యున్నత  లక్ష్యం  వైపు  మిమ్మల్ని లాగుతుంది.

చిన్ని నోరు: మితంగా మాట్లాడాలి.

ఏక దంతం: మంచిని ఉంచుకుని చెడును విసర్జించాలి.

అభయ హస్తం: రక్షణకు చిహ్నం. నాయకుడైనవాడు తన బృందానికి రక్షణ కవచంలా ఉండాలి. ఆధ్యాత్మిక ప్రగతివైపు పయనించాలని సూచిస్తుంది. వ్యక్తిగత వికాసంనుండి వ్యక్తిత్వ వికాసంవైపు పయనించగలవాడే అభయమివ్వగలడని బోధిస్తుంది.

తొండం: అత్యున్నత సామర్ధ్యానికి, ఎటువంటి స్థితికైనా ఒదిగిపోయి, సర్దుకుపోయే తత్వానికి ప్రతీక.

పెద్ద పొట్ట: జీవితంలోని మంచి, చెడుని ‘స్థితప్రజ్ఞత’తో జీర్ణించుకోవాలని బోధిస్తుంది.

మోదకం (ఉండ్రాళ్ళు) : మన ప్రయత్నాలకు, సాధనకు లభించే బహుమతి.

ప్రసాదం: ప్రపంచమంతా నీ పాదాల చెంత ఉంటుంది. నీ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు –
నువ్వు నడుస్తూ నలుగురినీ నడిపించే రీతిలో ఉంటే విజయం నీ సొంతం.

మూషికం: మనిషిలో పెరిగిపోయే కోరికలకు గుర్తు. నియంత్రించకపోతే మన మీదే సవారీ చేస్తాయి. నువ్వే కోరికల మూషికాన్ని  నియంత్రించి సవారీ చేయాలని బోధిస్తుంది.

- చల్లా రామ ఫణి
9247431892

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!