భారత మాత – సెంకండ్ ఇన్నింగ్స్ (పార్ట్ 2)



అసలు,  నాయకుడంటే ఎలా ఉండాలి?  నాయకులు ఎలా తయారవుతారు?  నాయకుల విజయం వెనుక దాగున్న రహస్యాలేమిటి ?? అంటూ మీరు ఈపాటికే బోలెడు పుస్తకాలు చూసేఉంటారు. ఇవన్నీ చూస్తుంటే మనకో అనుమానం రాకమానదు.

వీధివీధిలో నాయకులు పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి పుస్తకాలు అవసరమా…అని. అయితే, వాస్తవమేమిటంటే, ఇప్పటికీ నిజమైన నాయకులు మనదేశంలో చాలా తక్కువ మంది మాత్రమే ఉండటం. దశాబ్దాలు దొర్లుతున్నా, పల్లెలూ, పట్టణాల్లో అభివృద్ధి నామమాత్రంగానే కనిపిస్తోంది. ఉదాహరణకు రోడ్లనే తీసుకుందాం… అవి వేసిన కొద్ది రోజులకై చంద్రమండలం ఉపరితలంలా మారిపోతున్నాయి. చాలా చిత్రమేమంటే, రోడ్లు వేసిన కాంట్రాక్టర్ కే రోడ్లు రిపేర్ పనులు అప్పగించేస్తున్నారు అవినీతి అధికారులు. ఇదేమని ప్రశ్నించే నాయకులే లేరు. దీంతో విచ్చలవిడితనం పేరుకుపోతోంది.
అవినీతిని పోషిస్తున్న నాయకులు
పేరుకుపోతున్న విచ్చలవిడితనం
అక్రమ చర్యల వెనుక నేతల హస్తం
సైన్యంలోనూ అవినీతి చెద
ఈ రోజుల్లో మనదేశంలో పాలకులుగా చలాయించేవారి సంఖ్య పెరిగిపోతోంది…కానీ దేశం కోసం నిలబడే నాయకులు కరవయ్యారు.   గతంలో రాజకీయ నాయకులు జాతి నిర్మాణానికి నేనేం చేయాలని అడిగేవారు, ఇప్పుడు ఆ ధోరణి చాలా అరుదు… ఏం చేస్తే ఎన్నికల్లో గెలుస్తామనే నేతలు ఆలోచిస్తున్నారు.మనదేశానికి పట్టిన అవినీతి చీడను తొలగించాల్సిన నాయకులే  అవినీతిని పెంచిపోషిస్తున్నారు. అన్యాయాలను, అక్రమాలను ఎదిరించాల్సిన నేతలే వాటిపై స్వారీ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు వారిని లీడర్స్ గా ఎలా పిలవగలం?
రోడ్లు వేసిన కాంట్రాక్టర్ కే వాటి రిపేర్ పనులు అప్పగించేస్తున్నారు అవినీతి అధికారులు. ఇదేమని ప్రశ్నించే నాయకులే లేరు. దీంతో విచ్చలవిడితనం  పేరుకుపోతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాధమిక విద్యాభ్యాసమన్నది గగన కుసుమమే అయింది. పౌరుల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలు సైతం ఆక్రమణలకు గురవుతున్నాయి. అక్కడ కూడా బిల్డింగులు వెలుస్తున్నాయి. అదేమని అడిగితే, ప్రతి అక్రమ చర్య వెనుక   ఓ నాయకుని హస్తం కనిపిస్తోంది. దీంతో అడిగిన వారి నోరు నొక్కేస్తున్నారు. పన్నులు చెల్లించేవారికి కనీసపు సామాజిక భద్రతను ఈ ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి. అన్నింటికంటే, దురదృష్టమైన విషయమేమంటే, దేశప్రజలంతా ఎంతో గర్వించే  భారత సైన్యంలో కూడా అవినీతి చెదపురుగులు ప్రవేశించడం.
(మిగ‌తా 3వ భాగంలో)
-తుర్లపాటి నాగభూషణ రావు
nrturlapati@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!