సుప్రీంలో జగన్ కు ఎదురుదెబ్బ


జగన్ పిటీషన్ ను సుప్రీం కోర్టు త్రోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును సమర్దించింది. రాంజఠ్మలానీ జగన్ తరఫున వాదించగా, సుప్రీంకోర్టు పిటీషన్ ను త్రోసిపుచ్చింది.  జగన్ పై రాజకీయ కక్షలతోనే సీబీఐ కేసులు పెట్టారంటూ రాంజఠ్మలానీ వాదించారు. అయితే, ఈ వాదనలను సుప్రీం త్రోసిపుచ్చింది.  వాదనలను విన్న తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పిటీషన్ ను త్రోసిపుచ్చారు. సీబీఐ ప్రస్తుతం కొనసాగిస్తున్న దర్యాప్తును నిలిపివేయాలంటూ కూడా జగన్ తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే, స్టే ఇవ్వడానికి సుప్రీం అంగీకరించలేదు. పిటీషనర్ ముందస్తుగా లేవనెత్తిన సందేహాలను పట్టించుకోలేమని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో జగన్ కు చుక్కెదురు కావడంతో ఇక సీబీఐ దర్యాప్తు నిరాఘాటంగా సాగుతుందనీ, జగన్ అరెస్ట్ ఖాయమన్న ఊహాగానాలు వినబడుతున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!