`సుప్రీం’ పవర్ (Part-2)



మనదేశంలో న్యాయవ్యవస్థ సమానాంతర పరిపాలన సాగిస్తోందా? ఇటీవల కాలంలో న్యాయస్థానాలు ఇస్తున్న సంచలన తీర్పులు, స్వయంగా కేసులు స్వీకరించి పరిష్కరిస్తున్న తీరుతెన్నులు చూస్తుంటే ఏమనిపిస్తోంది? ప్రజదల పక్షాన నిలుస్తున్నది శాసన వ్యవస్థ ద్వారా ఎన్నికైన పాలకులా, లేక న్యాయవ్యవస్థను సమున్నుతంగా నడిపిస్తున్న న్యాయమూర్తులా? ఏది నిజం? మరేది అవాస్తవం…??

(రెండ‌వ భాగం)

2జి ఉచ్చు


సుప్రీంకోర్టు తీసుకున్న చొరవ కారణంగానే 2G spectrm కుంభకోణంలో  పెద్దలు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఇదే కుంభకోణంలో చిక్కుకున్న దయానిధి మారన్ కేంద్ర జౌళి శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. ఇప్పటికే ఈ కేసులో   కనిమొళి, అలాగే, A. రాజాలు తీహార్ జైల్లో ఉన్నారు. సీబీఐ ఈ కేసును సమర్ధవంతంగా నిర్వహించడం వెనుక సుప్రీం మార్గదర్శకాలు, సూచనలు ఉన్నాయన్నది నిర్వివాదంశం.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన కామన్వెల్త్ గేమ్స్ లో కూడా అవినీతి కుంభకోణాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో కూడా  సుప్రీంకో కోర్టు ఎంతో కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. దీంతో సురేష్ కల్మాడి జైలుపాలు కావాల్సి వచ్చింది.


బ్లాక్ మనీపై కొరడా

నల్లధనాన్ని తిరిగి స్వదేశానికి రప్పించే విషయంలో కూడా సుప్రీంకోర్టు చాలా చురుగ్గా స్పందించింది. నత్తనడకగా ఉన్న దర్యాప్తుపై మండిపడింది. 1948 నుండి 2008 కాలంలో భారతదేశం నుంచి సుమార 20 లక్షల కోట్ల రూపాయలు ఇతర దేశాలకు తరలించినట్టు సర్వేలు చెబుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు, పర్యవేక్షణ కోసం  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని తనకుతానుగా ఏర్పాటు చేసుకోవడంతో సుప్రీం లోని సీరియస్ నెస్ బయటపడింది.
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ విధానాన్ని కూడా  సుప్రీం కోర్టు ఎండగట్టింది. ప్రైవేట్ ఆస్పత్రులు తమకుతాము  స్టార్ హోటళ్లగా ఎలా భావిస్తున్నాయి…? అంతే స్థాయిలో ఛార్జులు ఎలా వసూలు చేస్తున్నాయో చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. అవుట్ పేషెంట్లలో 25 శాతం మందికీ, అలాగే, ఇన్ పేషెంట్లలో పది శాతం మందికి ఉచిత వైద్యం అందిస్తామంటూ ఇచ్చిన హామీలను ఎందుకు బుట్టదాఖలు చేశారంటూ సుప్రీం మండిపడింది.
ఉత్తరప్రదేశ్ లోని నోయిడా లో వ్యవసాయ భూములను సెజ్ ల పేరిట లాక్కోవడాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. పాలకులు రైతుల పక్షాన నిల్వకుండా, వ్యాపారవేత్తలను సమర్ధించడాన్ని సుప్రీం తప్పుపట్టింది.
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ పదవికి పి.జె.థామస్ రాజీనామా చేయడంలో కూడా సుప్రీంకోర్టు కీలకపాత్ర పోషించింది. అంతేకాదు, సివీసీ నియామకంలోపాలకులు రైతుల పక్షాన నిల్వకుండా, వ్యాపారవేత్తలను సమర్ధించడాన్ని సుప్రీం తప్పుపట్టింది. ఎలాంటి ప్యానెల్ ఉండాలో కూడా మార్గదర్శకం చేసింది.


`అనంత’ నిధులపై ఆదేశం

కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆలయం నేలమాళిగల్లో నిక్షిప్తమై ఉన్నపాలకులు రైతుల పక్షాన నిల్వకుండా, నిధుల విషయంలో కూడా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయమే తీసుకుంది. టి.పి. సౌందర్ రాజన్ అనే న్యాయవాది వేసిన పిటీషన్ కు స్పందిస్తూ, నేలమాళిగను తెరిపించేపని జాతి ప్రయోజనాల దృష్ట్యా స్వయంగా చేపట్టింది.

చక్రవర్తినే మందలించిన న్యాయమూర్తి

ఒక దేశం, లేదా ఒక రాష్ట్రం సుఖసంతోషాలతో ఉండాలంటే, అక్కడ పాలనావ్యవస్థతో పాటుగా న్యాయవ్యవస్థ కూడా బలోపేతంగా ఉండాల్సిందే. రాజు లేదా చక్రవర్తి అత్యంత శక్తివంతుడు అయితే కావచ్చు. కానీ న్యాయశాస్త్ర మర్మాలు రాజుకు తెలియాలని లేదు. ఇదే విషయాన్ని 16వ శతాబ్దిలోనే న్యాయమూర్తి సర్ ఎడ్వర్డ్ కోక్ చెప్పినప్పుడు యావత్ ప్రపంచం విస్తుబోయింది. బహుశా ప్రపంచ చరిత్రలో న్యాయవ్యవస్థ పవర్ ఏమిటో చాటిచెప్పిన తొలి సంఘటన ఇదేనేమో… ఆనాటి నుంచీ ఈనాటివరకు  పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థల్లో ఏది బలోపేతమైనదన్న విషయంలో మీమాంశ చెలరేగుతూనే ఉంది.   ఈ మధ్యకాలంలో, మరీ ముఖ్యంగా S.H.కపాడియా సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ అయినప్పటి నుంచీ సర్వోన్నత న్యాయస్థానం ఇస్తున్న తీర్పులకు ప్రజలు జైకొట్టడం న్యాయవ్యవస్థ ఠీవీని ఇనుమడింపజేస్తోంది.
మనదేశ న్యాయవ్యవస్థ ఈ మధ్యకాలంలో చురుగ్గా స్పందిస్తుందన్న ప్రశంసలు అందుకుంది. నూటఏభైఏళ్లకు పైగా మనదేశాన్ని పాలించిన బ్రిటీష్ వారి న్యాయవ్యవస్థకంటే  మన సుప్రీంకోర్టు చాలా చురుగ్గానే ఉన్నదా?
అవునంటున్నారు న్యాయ నిపుణులు. అయితే, పాలనా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపడంలో అమెరికా, యూరోపియన్ దేశాలతో పోలిస్తే మన దేశ న్యాయవ్యవస్థ తక్కువ స్థానంలోనే ఉన్నదట.

(మిగ‌తా మూడ‌వ భాగంలో)

తుర్ల‌పాటి నాగ‌భూష‌ణ‌రావు
nrturlapati@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!