జగన్ జైలుకెళ్తే…

2. జగన్ జైలుకు వెళ్లడమన్నది ప్రజల్లో ఓ పాజిటీవ్ ఇమేజ్ నే క్రియేట్ చేస్తుంది.
3. వాస్తవాలను అధికార కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు తెలుసుకోలేకపోతున్నారు. జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను చాలా తక్కువగా ఊహించుకుంటున్నారు. వీరిలో కొన్ని రకాల భ్రమలు, అపోహలు ఉన్నాయి. జగన్ అక్రమ సంపాదన వ్యవహారం తేలినా, న్యాయస్థానాలు తీర్పు చెప్పినా, ఆయన జైలుకు వెళ్ళినా ప్రజల్లో కూడగట్టుకున్న అభిమానం మరింత పెరిగే అవకాశమే ఉంటుందేతప్ప, ఇసుమంత కూడా తగ్గదు.
4. జగన్ ఇప్పటికే ప్రజల్లో కూడగట్టుకున్న ప్రజాఅభిమానంతో ఆయన జైల్లో ఉన్నా, `కథ’ నడిపించగలరు.
5. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతోనే జగన్ ఊహించినదానికంటే ఎక్కువగానే సానుభూతి సంపాదించుకున్నారు. పైగా ఓదార్పు యాత్రలతో ఇది మరింత ఎక్కువ అవుతోంది. దీనికి తోడుగా, జగన్ జైలుకు వెళ్తే, కచ్చితంగా ఈ సానుభూతి మరింత ఎక్కువ అవుతుంది. దీంతో జైల్లో ఉన్నా, జగన్ మహానేతగానే వెలిగిపోవడం ఖాయం.
6. రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ కదుపుతున్న పావులు చివరకు జగన్ కు చెక్ పెట్టకపోగా, ఆయనకే సహకరించవచ్చు.
7. తమిళనాట రాజ, కనిమొళిలకు జరిగిన నష్టం అలాగే డీఎంకెకు వాటిల్లిన కష్టం వంటివి ఇక్కడ జగన్ కు గానీ, ఆయన ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ కలగే అవకాశాలు లేవు. అంటే, తమిళనాడులో వేసిన మంత్రం ఇక్కడ పారదు.
8. తాను జైలుకు వెళ్ళాల్సి వస్తుందేమోనన్న భయం జగన్ కు కూడా లేకపోలేదు. అందుకే, ఆయన ఇప్పటి నుంచే రాజకీయ పవర్ ను డీసెంట్రలైజ్ (వికేంద్రీకరణ) చేస్తున్నారు. పార్టీ అంటే తానొక్కడే అన్న భావన నుంచి పార్టీ అంటే అనేక యువనేతల సమాహారమన్న దిశగా జగన్ పార్టీని తీసుకువెళ్తున్నారు.
9. అందుకే, డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రకటించారు. ఇకపై మిగతా నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించవచ్చు.
10. మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయన్న సంకేతాన్ని ఇవ్వడం కోసమే జగన్ ఈ ప్రకటనలు చేశారని అనుకోలేము, అంతకంటే మరో వ్యూహం ఏమిటంటే, తన పార్టీ పవర్ ను డిసెంట్రలైజేషన్ చేయడమే.
11. అలా చేస్తే, జగన్ జైల్లో ఉన్నా పార్టీకి జరిగే నష్టం బహుస్వల్పమే అవుతుంది.
12. అంటే, జగన్ జైల్లో ఉన్నా, ఆ పార్టీ అఖండ విజయం సాధించడానికి ఇప్పటి నుంచే వ్యూహరచన ప్రారంభమైందనే అనుకోవాలి.
13. జగన్ అనూలోచితంగానో, లేదా, ఆవేశపూరితంగానో ప్రకటనలు చేయడంలేదు. వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నారు. ఈ వ్యూహాలు ఫలిస్తే, రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. తెలుగుదేశం పార్టీ విస్తుపోవడం ఖాయం.
తుర్లపాటి నాగభూషణ రావు
nrturlapati@gmail.com
nrturlapati@gmail.com
ఇది నూటికి వేయి శాతాం నిజం . జగన్ జైలుకు వెళ్తే కాంగ్రెస్ పునాదులు కూలడం ఖాయం. జగన్ కంపేనీలలొ కంపేనీల చట్టానికి విరుద్ధముగా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలను పిచ్చి వాళ్ళు అనుకోవాలా ? పెట్టిన సొమ్ము సరైనదా కాదా అని మాత్రమే చట్టం చూస్తుంది.ఈ లెక్కన జగన్ జైలు లొ కాదు ప్రజలమధ్యే ఉంటాడు , ఈ రోజు న విమర్శలు చెస్తున్న నాయకులకు ఈ విషయాలన్ని తెలియవనుకోవడాని ప్రజలు పిచ్చి వాళ్లు కాదు.
రిప్లయితొలగించండిఎలాంటి రాజకీయానుభవం లేకుండా మా నాన్నగారు ముఖ్యమంత్రిగా పని చేశారు కనుక నాకూ ముఖ్యమంత్రి పదవి కావాలి అంటే జగన్‌కి ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారు? ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లో సిసి కెమెరా ఆపరేటర్‌గా పని చేసిన మా నాన్నగారు చనిపోతేనే ఆయన ఉద్యోగం నాకు గానీ మా తమ్ముడికి గానీ ఇవ్వలేదు. కీలకమైన ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా కావాలంటే ఎవరిస్తారు?
రిప్లయితొలగించండిPraveen Sarma గారికి ,
రిప్లయితొలగించండిమన దేశములో మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అన్ని పదవులు ఎలాంటి రాజకీయానుభవం లేకుండా వారసత్వముగా వచ్చినవే.
ఇప్పుడు మన రాష్ట్రం లొ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు, స్పీకర్ , డిప్యూటి స్పీకర్ , హోం మంత్రి , ఇంకా చాలామంది ఉన్నారు గమనించండి. వీరిలొ కొద్దిమంది మాత్రమె అంటె చంద్రబాబు గారు మాత్రమే ముందు నుంచి రాజకీయాలలొ ఉంది. వీరికి వున్న వారసత్వము జగన్ కి వస్తె తప్పు ఎమిటి ?
అందరూ గడ్డి తింటున్నారు కాబట్టి మనమూ గడ్డి తినాలని రూలేమీ లేదు. పది మంది నమ్మినదే నిజం అనుకుంటే హిట్లర్‌లాగ పచ్చి అబద్దాలని కూడా నిజాలు చేసెయ్యొచ్చు. వారసత్వం పేరుతో రాజకీయాల్లోకి వచ్చినవాణ్ణి ప్రజల మనిషి అనొద్దు. తాను ప్రజల మనిషి కాదు అనే విషయం జగన్‌కి బాగానే తెలుసు.
రిప్లయితొలగించండికేవలం వారసత్వం ద్వారా పదవులు కావాలంటే పార్టీలు మార్చే పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళకి కూడా పదవులు ఇవ్వొచ్చు. పరకాల ప్రభాకర్‌కి కూడా మంత్రి పదవి ఇచ్చేవాళ్ళు. అతని తండ్రి మంత్రిగా పని చేసినా అతనికి కాంగ్రెస్‌వాళ్ళు మంత్రి పదవి ఇవ్వలేదనే కదా బి.జె.పి.లోకి, పి.ఆర్.పి.లోకి మారాడు.
రిప్లయితొలగించండిమరి వారసత్వం పేరుతో రాజకీయాల్లోకి రాని వారు ఎవరో ? జెండాలు పట్టుకొని తిరిగే కార్యకర్తలు ఎవరికి పదవులు రావెందుకు ? ఒకరికి ఒక నీతి మరి ఒకరికి వెరొక నీతి . కనీసం సర్పంచ్ పదవి రావాలన్న వారసత్వం లేనిదే రాదు . పార్టీలు మార్చిన వారెందరొ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు .
రిప్లయితొలగించండిమంత్రి కొడుకైన పరకాల ప్రభాకర్‌కి ఎమ్మెల్యే పదవి కూడా ఎందుకు ఇవ్వలేదు? అలాగైతే మా తాతయ్య (అమ్మగారి నాన్నగారు) కూడా మాజీ ఎంపి. కానీ మా అమ్మానాన్నలు ఉద్యోగాలు చేసుకుంటూ ఎందుకు బతికారు? పైగా మా తాతయ్య వారసత్వం పేరుతో రాజకీయాలలోకి రాలేదు. అతను రాజకీయాలలోకి రాకముందు గ్రామ మునసబ్. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంపిగా పోటీ చేశారు. పది మంది నమ్మేదే నిజం అనుకుంటే హిట్లర్‌లాగ పచ్చి అబద్దాలని కూడా నిజాలు చెయ్యొచ్చు. పది మంది వారసత్వం పేరుతో రాజకీయాల్లోకి వస్తున్నారు కనుక వారసత్వమే శ్రేష్టం అనుకుంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాచరికాన్ని పునరుద్ధరించడమే అవుతుంది.
రిప్లయితొలగించండి