కొండంత రాగం తీసి..


కొండంత రాగం తీసి అదేదో పాట పాడిన‌ట్టుగా జ‌గ‌న్ వ్య‌వ‌హారంలో సిబిఐ ప‌ని ఉంటుందా..?  ప్ర‌స్తుతం అవే అనుమానాలు రేకెత్తుతున్నాయి. జ‌గ‌న్ ప‌గ‌డ్బంధీ ప్ర‌ణాళిక ద్వారా త‌న సామ్రాజ్యాన్ని నిర్మంచుకున్నారని, చ‌ట్టానికి లొంగ‌కుండా ఉండేందుకు ఎంతో తెలివిగా పావులు క‌దిపార‌ని భావిస్తున్నారు. సిబిఐ విచార‌న పూర్త‌యి మంగ‌ళ‌వారం నాడు హైకోర్టుకి నివేదిక‌ని స‌మ‌ర్పించ‌నున్న సిబిఐ ఆ నివేదిక‌లో ఏం పేర్కొంటుందో అన్న‌ది ఇప్పుడు అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పుడే సిబిఐ ఎలాంటి నివేదిక ఇస్తుందన్నదానిపై ఊహాగానాలు వస్తున్నాయి.సిబిఐ అన్ని విషయాలను , అన్నికోణాలలో పరిశీలించినా, చట్టవిరుద్దంగా ఏ వ్యవహారం జరిగిందన్న అభిప్రాయానికి రాలేకపోయిందని జగన్ వర్గం భావిస్తుండగా, జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించే ఒక పత్రిక తొంభై శాతం నిర్ధారణ అయినట్లు పేర్కొంది. మరో పత్రిక మాత్రం ప్రాధమికంగా ఆధారాలు ఉన్నట్లు అభిప్రాయపడినా,మరింత లోతుగా విచారణ జరిపి నిగ్గు తేల్చాలని సిబిఐ హైకోర్టును కోరవచ్చని రాసింది.ఒకవేళ సిబిఐ కోరిన మేరకు సమగ్ర దర్యాప్తునకు న్యాయస్థానం అనుమతించిన పక్షంలో కేసు మరో సంచలనానికి కేంద్ర బిందువు అవుతుందని , అవసరమైతే కేసు నమోదు చేసి కొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని పేర్కొంది.కాగా సిబిఐ విచారణలో తేలేదేమీ ఉండదని, ఒక వేళ ఎవైనా లోపాలు ఉన్నట్లు కనిపెట్టినా దానికి ఆదాయపన్ను కట్టించుకుంటారు మినహా జరిగేదీ లేదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేత గోనె ప్రకాషరావు అంటున్నారు.జగన్ తన నైపుణ్యంతో కంపెనీలను నడిపి లాభాలబాటకు తెచ్చారని, ఇందులో పెట్టుబడులు పెట్టినవారికి దీనివల్ల మరింత లాభం వచ్చిందని , అందువల్ల జరిగేదీ ఉండదని అంటున్నారు. ఈ నెల ఇరవై ఏడో తేదీన ఈ కేసు విచారణ హైకోర్టులో మళ్లీ రానుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!