లార్డ్స్‌లో ఆడ‌టం ఓ గొప్ప గౌర‌వం..!


క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్‌లో ఆడటం ఏ ఆటగాడైనా గొప్ప గౌరవంగా భావిస్తాడు. టీమిండియా కెప్టెన్ ధోనీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జట్టుకు సారథ్యం వహించడం గర్వకారణమని ధోనీ అన్నాడు. గురువారం ఇంగ్లండ్‌తో ఆరంభం కానున్న చారిత్రక టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు నాయకత్వం వహించడం తన కెరీర్‌లో ప్రత్యేకమైన గౌరవమని పేర్కొన్నాడు. అంతేగాక, వందకోట్ల పైచిలుకు భారతీయులకు ప్రాతినిధ్యం వహించడం బాధ్యతగా భావిస్తున్నానని మహీ చెప్పాడు. ‘లార్డ్స్‌లో జట్టుకు సారథ్యం వహించడం ఎంతో గౌరవం, ప్రత్యేకం. ప్రతీ మ్యాచ్‌లో భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటారు. ఇది సాధ్యం కాకపోయినా అంచనాలుంటాయి’ అని ధోనీ అన్నాడు. లార్డ్స్ మ్యాచ్‌తో సహా పలు విషయాలపై ధోనీ ముచ్చటించాడు. కాగా లార్డ్స్ మైదానంలో స‌చిన్ సెంచ‌రీ చేసి టెస్ట్ మ్యాచ్‌ల‌లో త‌న వంద‌వ సెంచ‌రీని న‌మోదు చేసుకోవాల‌ని ఆరాట‌ప‌డుతున్నాడు.. అయితే స‌చిన్‌కి ఆ అవ‌కాశం ఇవ్వ‌బోమ‌ని ఇంగ్లండ్ ఆట‌గాళ్లు చెబుతున్నారు.. ఏది ఏమ‌యిన‌ప్ప‌టికీ నేటితో ప్రారంభ‌మ‌వుతున్న ఇంగ్లండ్‌, ఇండియా మ్యాచ్‌లు క్రికెట్ అభిమానుల‌ని అల‌రిస్తాయ‌ని చెప్ప‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!