ఫేస్‌బుక్‌లో సి.ఎం. కిర‌ణ్‌


ప్రపంచ నెంబ‌ర్ వ‌న్ సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ పోర్టల్ ఫేస్‌బుక్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి జాయిన్ అయ్యారు. దీని ద్వారా రాష్ట్ర ప్రజ‌ల‌కు మ‌రింత అదుబాటులో ఉండ‌టానికి వారి స‌మ‌స్యల‌ని వెంట‌నే ప‌రిష్కారం చేసే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని ఈ ఫేస్‌బుక్‌లో జాయిన్ అయిన‌ట్టు ముఖ్యమంత్రి ప్రక‌టించారు. ఇంత‌కు ముందు న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి పేరుతో ఉన్న ఫేక్ అక్కౌంట్లని బ్లాక్ చేయ‌నున్నారు. ఇక‌నుండిత‌న ఫేస్ బుక్ ఎక్కౌంట్‌లో తాను తీసుకున్న తాజా నిర్ణయాలు, ప్రభుత్వ ప‌థ‌కాల గురించి వివ‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌ను ఇందులో పెట్టనున్నారు. సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ పోర్టల్ ఇ ఇప్పటికే ఎంద‌రో సెల‌బ్రిటీలు మెయిన్‌టెయిన్ చేస్తూ త‌మ అభిమానులకి చేరువ కావ‌డానికి ప్రయ‌త్నిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి కూడా త‌న ఫేస్‌బుక్ ఎక్కౌంట్ ద్వారా ప్రజ‌ల‌కి మ‌రింత చేరువ కావాల‌ని అనుకుంటున్నారు. సో.. ఇక నుండి మీరు ముఖ్యమంత్రి గారితో ఏదైనా చెప్పాల‌నుకుంటే ఆల‌స్యం చేయ‌కుండా ఫేస్‌బుక్‌లోకి ఎంట‌ర‌యిపోండి..!

కామెంట్‌లు

  1. పెద్ద పోటుగాడొచ్చాడండీ. ఆరోగ్యశ్రీలో జరుగుతోన్న అవినీతి గురుంచి ఆ మహానుభవునికి రెండుమూడు మెయిల్స్ పంపాను. మెయిల్స్‌కే సమాధానం చెప్పనివాడు ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ పెట్టి ఏమి పొడుస్తాడు?

    రిప్లయితొలగించండి
  2. ఈ ఫేస్ బుక్ అకౌంట్ ఎవరో చూస్తూ ఉంటారు. పేరు కిరణ్ కుమార్ రెడ్డిది అయి ఉంటుంది.
    Praveen, ఎంత అవినీతి జరిగినా ఆరోగ్య శ్రీ అనెది ఒక అన్‌టచబుల్ పథకం. దాన్ని ఎవరూ తాకలేరు.

    రిప్లయితొలగించండి
  3. అవినీతిపరులని మేపడానికి ప్రభుత్వానికి డబ్బులు చెట్లకి మొలుస్తాయా? వీళ్ళని మేపడానికి రాష్ట్ర ప్రభుత్వం దొంగ నోట్లు ప్రింట్ చేస్తుందా?

    రిప్లయితొలగించండి
  4. ఆ ప్రొఫైల్ పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి కాదు. తన PA చేత పెట్టించి డబ్బింగ్ చెప్పిస్తున్నాడు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!