ఇదో కొత్త‌ర‌కం వాస్తు..


ప్రజల నమ్మకాలు భలేగా ఉంటాయి. ఒక్కోసారి ఒక్కక్క నమ్మకం విపరీతంగా పెరుగుతుంది. ఆ నమ్మకాల కొనుగోలుదారులకు ఎంత లాభం కలుగుతుందోకాని, అమ్మకం దారులకు మాత్రం డబ్బుల పంట పండుతుంది. ఆ మధ్య కాలంలో చైనా బొమ్మలకు గిరాకి విపరీతంగా ఉండేది.అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు చీరలు పెట్టాలనో, బంగారం పెట్టాలనో ఒక ప్రచారం జరుగుతుంది. దాంతో ఆ వస్తువులకు విపరీతమైన గిరాకి ఏర్పడుతుంది. ఇక ధంతే రాస్ వంటి వి ప్రత్యేకంగా వచ్చేశాయి. తాజాగా వాస్తు చేపల నమ్మకం జోరు అందుకుంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఇది వ్యాప్తిలోకి వచ్చినట్లు కధనాలు వస్తున్నాయి. కోస్తా ఆంధ్రలో వాస్తు చేపలకు బాగా గిరాకి పెరుగుతోంది.కార్పొరేట్ ఆఫీసులు, ధనిక పారిశ్రామికవేత్తలు, ఆమాటకు వస్తే మధ్యతరగతి వారు సైతం తమ నివాసాలలో ఈ వాస్తు చేపలను అక్వేరియం లను ఏర్పాటు చేసుకుంటున్నారు.గతంలో కూడా ఇలాంటి అక్వేరియం లు ఉన్న ఇళ్లు ఉండేవి కాని అప్పట్లో కేవలం అవి అందమైన అలంకరణగా ఉండేది. కాని ఇప్పుడు ఇది వాస్తు నమ్మకంగా మారింది.ఇందులో రెండు రకాల చేపపిల్లలకు బాగా గిరాకి వస్తోంది.ఆ డిమాండును తట్టుకోవడం కష్టంగా ఉందని సరఫరాదారులు చెబుతున్నారు.అరోవన,ఫ్లవర్ హార్న్ అనే రకాల చేపపిల్లలను వాస్తు చేపలుగా పరిగణిస్తున్నారు.వీటికి మాజికల్ పవర్స్ ఉన్నాయని వినియోగదారులు భావిస్తున్నారు.ఈ చేపల ఖరీదు మూడు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలవరకు ఉంటోంది.మంచి ఆరోగ్యం, అదృష్టం, సుదీర్ఘకాలం జీవించడానికి ఈ వాస్తు చేపలు ఉపయోగపడతాయని జనం నమ్ముతున్నారట.ఇందులో కూడా రకరకాల రంగుల చేపలకు వాటి రంగును బట్టి ధర ఉంటోంది.బాంకాక్, సింగపూర్ ల నుంచి ఈ చేపపిల్లను చెన్నై,బెంగలూరు వ్యాపారుల ద్వారా తెప్పిస్తున్నారు. కొందరైతే చేపలతోపాటు, మత్స్య యంత్రాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారట. అర్జునుడు ద్రౌపదీ స్వయంవరంలో మత్స్యయంత్రం ద్వారా చేపపిల్లలను ఛేదించిన పురాణం కూడా ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటున్నారు. రకరకాల నమ్మకాలతో రకరకాల వ్యాపారాలు సాగుతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!