బంద్ ఖ‌రీదు.. 1000 కోట్లు..!



రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితి వ్యాపార పారిశ్రామిక వర్గాల్ని కలవరపరుస్తోంది. ఆర్థికాభి వృద్దిమీద, రాష్ట్ర ప్రగతిపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని.. పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. తెలంగాణ ఇవ్వడం, ఇవ్వకపోవడం వంటివాటితో తమకెలాంటి సంబంధం లేకపోయినా.. సుదీర్ఘంగా సాగుతున్న ఈ వివాదం పరిశ్రమ లపై చాలా ప్రభావం చూపుతోందని అంటున్నారు. గత ఏడాది రాష్ట్రం నుంచి 75 వేల కోట్ల ఎగువతులు జరిగాయి. అంటే రోజుకు 250 కోట్ల విలువైన ఎగుమతులన్నమాట. ఇందులో 70 శాతం ఒక్క హైదరాబాద్ నగరం నుంచే జరుగుతుంది. దీనివల్ల స్థానిక ఉత్పాదకత నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. ఈ రకంగా చూస్తే.. రాష్ట్రానికి ఒక రోజు బంద్ ల వల్ల జరిగే నష్టం వెయ్యి కోట్లు ఉండవచ్చు. ఇందులో ఒక్క హైదరాబాద్ కే 600 నుంచి 700 కోట్ల నష్టం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయంపై 15 శాతం సాధారణంగా ప్రభుత్వానికి పన్ను రూపంలో లభిస్తుంది. అది మొత్తం పోయినట్లే. ఒక పారిశ్రామిక రంగం లేదా నిర్మాణ రంగం.. కనుక బంద్ కు గురైతే దాని ప్రభావం ఓ లింక్ మాదిరిగా అనేక రంగాలపై పడుతుంది. చివరికి రోజూవారీ కూలీలు, ఉద్యోగులు, చిన్నవ్యాపారులు, ట్యాక్సీలు, ఆటో డ్రైవర్లు సైతం దీని ప్రభావానికి గురికావాల్సి వస్తుంది. అంతేకాక ఈ ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ లో జరగవల్సిన బిజినెస్ సమ్మిట్లన్నీ చెన్నైకి తరలిపోయింది. ఫలితంగా ఎవరైనా పెట్టుబడి దారులు కూడా రాష్ట్రానికి రావడానికి వెనకాడుతారు. ఈ పరిస్థితిని గమనించి రాజకీయనాయకులు బంద్ వంటివి జరిపేటప్పుడు గమనంలోకి తీసుకోవాలని పారిశ్రామిక వేత్తలు సూచిస్తున్నారు.
source:kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!